బీహార్ లో ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుంది. ఆదివారం లఖిసరై నియోజకవర్గం అభ్యర్థిత్వంపై పార్టీ కార్యాలయానికి వెళ్లిన బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీని అక్కడి బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఇక ఎన్నికల బరిలో దిగే అభ్యర్థి స్థానిక వ్యక్తి అయి ఉండాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. అంతేకాదు గత 25 సంవత్సరాలుగా బీజేపీతో కలిసి కుమారి పనిచేస్తున్నారని తెలిపారు. ఇక కుమారి బబితాను లఖిసరై నియోజకవర్గం అభ్యర్థిగా నిలబెట్టాలని పార్టీ కార్మికులు నినాదాలు చేశారు. ఇక ఎవరి అక్కడి నుండి వెళ్లకపోవడంతో చివరకు పోలీసుల సహాయంతో సుశీల్ మోదీ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగనున్నాయని తెలిపారు. ఇక అక్టోబర్ 28న తొలి దశ, నవంబర్ 3న రెండో దశ, 7న మూడో దశ పోలింగ్ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. నవంబర్ 10న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారని తెలియజేశారు. ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించడంతో అభ్యర్థుల ఖరారులో పార్టీలు నిమగ్నమయ్యారు.