షర్మిల విషయంలో బిజెపి అలెర్ట్ అయింది…?

సినీ పరిశ్రమ పెద్దలతో భారతీయ జనతా పార్టీ పెద్దలు తెలంగాణలో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం ఏంటో తెలియదు. కానీ చాలా మంది సినీ నటులు మాత్రం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టడంతో కొంతమంది సినీ నటులు ఆ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని అందరూ భావించారు.

bjp
bjp

కానీ అది నిజం కాదని తెలిసింది. అయితే షర్మిల విషయంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలు అవుతున్నట్లు తెలుస్తుంది. దాదాపు ఏడాది కాలం నుంచి మెగాస్టార్ చిరంజీవి వంటి వారిని భారతీయ జనతా పార్టీ… తమ పార్టీలోకి తీసుకునే విధంగా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసి విజయవంతమైందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీతో కలిసి ముందుకు వెళ్తున్న బీజేపీ ఇప్పుడు తెలంగాణలో కొంతమంది సినీ నటులను కూడా పార్టీలోకి తీసుకుంటే మంచిది అనే భావనలో ఉంది.

కొంతమంది కోసం గట్టిగా ప్రయత్నం చేసింది. ఈ తరుణంలో షర్మిల కొంతమంది సినీ నటులు ఆకట్టుకోవడం వారికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఆఫర్ ఇవ్వడం ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్లను ప్రోత్సహించే ప్రయత్నం చేయడం వంటివి చేశారు. దీంతో ఇప్పుడు బిజెపి సీరియస్ గా ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.