కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీ బంపరాఫర్.. అందుకే బీజేపీలో చేరుతున్నారా?

-

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఇటీవలే తన సొంత పార్టీపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన ఇప్పటికే బీజేపీలోకి చేరుతారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడంతో అవి నిజమేనన్న విషయం ప్రస్పుటమైంది.

ఇవి రాజకీయాలు బాస్. ఎక్కడ లబ్ధి ఉంటుందంటే ఆ పార్టీలోకి జంప్ అయిపోవడం ఈరోజుల్లో కామన్. చాలా చాలా కామన్. ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఒకే పార్టీని పట్టుకొని వేలాడటం కాదు. తన రాజకీయ ఎదుగుదల కోసం పార్టీల ఆఫర్లను బట్టి పార్టీని మారుతూనే ఉండాలి. నేను తోపును.. నిజాయితీ పరుడిని.. నేను తొక్కతోలు అంటూ ఒకే పార్టీలో కూర్చుంటే వచ్చేదేం ఉండదు.

అందుకే ఇప్పటి రాజకీయాలు బాగా అప్ డేట్ అయ్యారు. ఏ పార్టీలో పదవి దొరుకుతుందంటే ఏమాత్రం ఆలోచించకుండా దూకేస్తున్నారు.

తాజాగా బీజేపీ తెలంగాణలో ఆకర్ష్ అంటూ ఏదో చేస్తోంది. ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలోకి లాక్కుంటోంది. పలు పార్టీల ముఖ్య నేతలకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తోంది. దీంతో వాళ్లు ఊరుకుంటారా? వెంటనే జంప్ కొట్టడానికి కొందరు నేతలు సిద్ధమయిపోయారట. ఆ లిస్ట్ మొదట ఉన్న నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్, రేవంత్ రెడ్డి.

అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఇటీవలే తన సొంత పార్టీపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన ఇప్పటికే బీజేపీలోకి చేరుతారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడంతో అవి నిజమేనన్న విషయం ప్రస్పుటమైంది.

ప్రస్తుతం ఆయన ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారట. బీజేపీ పెద్దలు ఆయనకు బంపర్ ఆఫరే ఇచ్చారట. బీజేపీలోకి వస్తే రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తామని చెప్పారట. కాకపోతే.. ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీజేపీ పెద్దలు స్పష్టం చేశారట.

వామ్మో.. బీజేపీ 2023ను టార్గెట్ గా పెట్టుకుందంటే ఏమో అనుకున్నాం కానీ.. తెలంగాణలో పాగా వేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే 2023లో బీజేపీ తెలంగాణలో ఏదో ప్రళయం సృష్టించబోతోంది. ఇది మాత్రం కన్ఫమ్.

ఇప్పటికే తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. తెలంగాణ నుంచి ఎంపీల సంఖ్యను పెంచుకోవాలని.. అందులో భాగంగానే కోమటిరెడ్డికి రాజ్యసభ ఎంపీ పదవిని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి బీజేపీ తరుపున పార్లమెంట్ లో ప్రాతినిధ్యాన్ని పెంచితే.. అది ప్రజల్లోకి మంచి సంకేతాలను తీసుకెళ్తుందని.. తద్వారా 2023 ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఓట్లను రాబట్టుకోవచ్చనేది బీజేపీ ప్లాన్. చూద్దాం మరి బీజేపీ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందో లేదో?

Read more RELATED
Recommended to you

Exit mobile version