తాజాగా దర్శకుడు తేజపై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు నటుడు విశాల్‌పై పడింది. ప్రస్తుతం చెన్నైలో ఉన్న శ్రీరెడ్డి విశాల్‌పై సంచలన ఆరోపణలు చేసింది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరిట అనేక మంది సినీ పెద్దలు, ఇతర వ్యక్తులు మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ.. అప్పట్లో నటి శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసి ఆ వివాదాన్ని రచ్చకీడ్చిన విషయం విదితమే. అందులో భాగంగానే ఆమె గతంలో హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో ఉన్న ఫిలిం చాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన కూడా చేసింది. అయితే ఆ తరువాత ఆమె పవన్ కల్యాణ్‌ను తిట్టడం.. ఆ విషయం కాస్తా మరుగున పడిపోవడం జరిగింది. కానీ శ్రీరెడ్డి ఇప్పుడు మళ్లీ అదే విషయాన్ని తెరపైకి తెచ్చి పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేస్తూ వారిని ఇష్టం వచ్చినట్లుగా దూషిస్తోంది.
తాజాగా దర్శకుడు తేజపై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు నటుడు విశాల్‌పై పడింది. ప్రస్తుతం చెన్నైలో ఉన్న శ్రీరెడ్డి విశాల్‌పై సంచలన ఆరోపణలు చేసింది. విశాల్‌తో ఏ హీరోయిన్ అయినా నటించాలనుకుంటే అతనికి కచ్చితంగా లొంగిపోవాలని శ్రీరెడ్డి అతనిపై కామెంట్లు చేసింది. అంతేకాదు.. ఆమె తన పోస్టుల్లో విశాల్‌ను దారుణంగా బూతులు వాడుతూ తిట్టింది కూడా. ”మిస్టర్ విశాల్ రెడ్డి.. నువ్ ఎలాంటి తప్పులు చేశావో నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి?? ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెమ్ వెన్నుమా?? ఇప్పిడి??..” అంటూ శ్రీరెడ్డి విశాల్‌పై ఆరోపణలు చేసింది.
అయితే శ్రీరెడ్డి విశాల్‌పై ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. సాధారణంగా విశాల్ ఎప్పుడూ తోటి సినీ నటులు, ఇతర సిబ్బందికి సహాయం చేస్తుంటాడు. అలాగే ఎప్పుడు ప్రకృతి విపత్తులు సంభవించినా సహాయం చేయడంలోనూ అతను అందరికన్నా ముందే ఉంటాడు. అలాంటి విశాల్‌పై శ్రీరెడ్డి ఇలాంటి ఆరోపణలు చేయడం అందరికీ విస్తుగొలుపుతోంది. మరి దీనిపై విశాల్ ఏమంటాడో.. వేచి చూస్తే తెలుస్తుంది..!