బిజెపి ఆదాయం ఎంత పెరిగిందో తెలిస్తే…!

-

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆదాయం భారీగా పెరిగింది. గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం, ఖర్చులు వివరాలను ఎలక్షన్ కమిషన్‌ కు సమర్పించిన లెక్కల ప్రకారం ఆదాయం 134 శాతం పెరిగింది. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం రూ.2,410 కోట్ల ఆదాయం సమకూరినట్టు పేర్కొంది. 2017-18 ఆర్ధిక సంవత్సరంలో రూ.1,027 కోట్లుగా ఉండగా,

బీజేపీకి గత ఆర్ధిక సంవత్సరంలో సమకూరిన ఆదాయంలో రూ.1,450 కోట్లు ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా వచ్చినట్టు వివరించింది. ఇదే 2017-18 విషయానికి వస్తే మాత్రం రూ.210 కోట్లు మాత్రమే ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా వచ్చిందట. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో రూ.1,005 కోట్లు ఖర్చుచేసినట్టు పేర్కొంది. ఈ ఖర్చులు 2017-18తో పోలిస్తే 32 శాతం అధికంగా ఉండటం గమనార్హం. 2017-18లో రూ.758 కోట్లుగా ఉంది.

2018-19 ఆర్ధిక సంవత్సరంలో రూ.792 కోట్లు. ఈ మొత్తాన్ని ఎన్నికలు, సాధారణ ప్రచారం కోసం వినియోగించినట్టు వివరించింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఆదాయం కేవలం రూ.918 కోట్లు అయితే, 2017-18తో పోల్చితే ఇది నాలుగు రెట్లు అధికం కావడం విశేషం. 2017-18లో ఇది రూ.199 కోట్లు కాగా, 2018- 19లో రూ.918 కోట్లు. ఖర్చులు రూ.470 కోట్లుగా తెలిపింది. ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా 2017-18లో కేవలం రూ.5 కోట్లు మాత్రమే ఆ పార్టీకి విరాళంగా రాగా, 2018-19లో ఇది రూ.383 కోట్లుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news