కమలంలో హడావిడి నేతలు…ఎవరు తగ్గేదేలే!

-

తెలంగాణలో ఇంతవరకు అధికారంలోకి రాని బీజేపీ ఇప్పుడు…అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. తొలిసారి తెలంగాణలో పాగా వేయాలనే లక్ష్యంగా ముందుకెళుతుంది. గత రెండేళ్ల నుంచి రాష్ట్రంలో బీజేపీ దూకుడుగా రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. అసలు కేసీఆర్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఆఖరికి బలమైన కాంగ్రెస్‌ని కూడా డామినేట్ చేసి..రెండోస్థానంలోకి ఎగబాకింది. ఇక టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే పరిస్తితి వచ్చింది.

అసలు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏ విధంగా కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతున్నారో తెలిసిందే. నిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు..ఆ సమస్యలపై కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఆ మధ్య ధాన్యం కొనుగోలు అంశంపై గళం విప్పిన బండి…ఇప్పుడు జీవో నెంబర్ 317కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. పైగా ఈ పోరాటంలో అరెస్ట్ కూడా అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం బండిని అరెస్ట్ చేయించి రెండు రోజులు జైల్లో కూడా పెట్టించింది.

బెయిల్ మీద బయటకొచ్చిన బండి తనదైన శైలిలో రాజకీయం చేయడం స్టార్ట్ చేశారు. కేంద్ర పెద్దలు కూడా బండికు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే వరుసపెట్టి జాతీయ నేతలు తెలంగాణలో ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మధ్యప్రదేశ్, అస్సాం సీఎంలు రాష్ట్రానికి వచ్చారు. ఇంకా జాతీయ నేతలు వరుసపెట్టి తెలంగాణకు వస్తున్నారు. సరే రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ బాగానే పోరాడుతున్నారు. కానీ కొందరు నేతలు పైకి ఏదో హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

ఏదో జాతీయ నేతల దృష్టిలో పడాలని చెప్పి వారు కూడా కేసీఆర్‌నే డైరక్ట్‌గా టార్గెట్ చేసుకుంటున్నారు. స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టకుండా, స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రజా వ్యతిరేక విధానాలని పెద్దగా ఎండగడుతున్నట్లు కనిపించడం లేదు. ఇలా చేయడం వల్ల క్షేత్ర స్థాయిలో కమలం పార్టీ బలోపేతం కాదు. అందరు ఏదో రాష్ట్ర స్థాయిలో హడావిడి చేయడం వల్ల ప్రయోజనం శూన్యం.

Read more RELATED
Recommended to you

Latest news