బీజేపీలో రెడ్ల‌కు అన్యాయం…!

-

ఏ ప్రభుత్వం అయినా, పార్టీ అయినా కులం ప్రతిపాదికనే ఎక్కువ పదవులు, సీట్లు పంపకాలు చేస్తాయి. ఈ పంపకాల్లో ఏమన్నా తేడా జరిగితే మా కులానికి అన్యాయం జరిగిపోయిందని ఆయా కులాల నేతలు గగ్గోలు పెట్టేస్తారు. అయితే తమ కులానికి అన్యాయం జరిగిందని సొంత పార్టీ నేతలు మాట్లాడితే అది పెద్ద చర్చ కాకపోవచ్చు కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడితే మాత్రం అది పెద్ద చర్చే అవుతుంది. ఇటీవల కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి బి.ఎస్. యడియూరప్ప 17 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.


అయితే మంత్రివర్గ విస్తరణపై మొన్నటివరకు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ మంత్రివర్గంలో తమ ‘రెడ్డి’ సామాజికవర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యేకి చోటు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కర్ణాటక బీజేపీలో 9 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఒక్కరికీ కూడా యడియూరప్ప మంత్రి పదవి ఇవ్వలేదు.

పైగా 17 మంది కొత్త మంత్రులలో ఎక్కువ మంది లింగాయత్‌లే ఉండటం గమనార్హం. ఇక దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి రెడ్డి వర్గానికి ఒక మంత్రి కూడా ఇవ్వకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి జరిగే కేబినెట్ విస్తరణలో అయిన తమ సామాజికవర్గానికి చోటు కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. రెడ్డి వర్గానికి ఈసారి అన్యాయం జరగకుండా చూసుకోవాలని సీఎంని కోరుతున్నారు.  రామలింగారెడ్డి విజ్ఞప్తిని యడ్డీ పట్టించుకుంటారో లేదో ? మరి చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news