ఏపీలో కొత్త రాజ‌కీయానికి తెర‌లేపిన బీజేపీ.. వ‌ర్కౌట్ అయ్యేలాగే ఉందే..

-

ప్ర‌తి చిన్న విష‌యాన్ని అది చిన్న‌దా పెద్ద‌దా అని చూడ‌కుండా రాజ‌కీయం చేయడంలో బీజేపీ నేత‌ల‌ను మించిన వారు లేరేమో. మిగతా పార్టీలు అవ‌కాశం ఎదురు చూస్తే బీజేపీ మాత్రం ఉన్న ప‌రిస్థితుల‌ను త‌న‌కు అవ‌కాశంగా మార్చుకుంటుంది. ఇక‌పోతే మ‌రీ ముఖ్యంగా హిందువుల విష‌యంలో మాత్రం బీజేపీ ఏదైనా స్టేట్ మెంట్ ఇచ్చిందంటే మాత్రం అది క‌చ్చితంగా క‌చ్చితంగా వ‌ర్కౌట్ అవుతుంది. ఎవ‌రైనా హిందువుల ప‌ట్ల చిన్న పొర‌పాటు చేసిన‌ట్టు క‌నిపించినా వెంట‌నే దాన్ని పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసేసి వారిని హిందూ వ్య‌తిరేకిగా ముద్రించేస్తుంది.

ఇప్ప‌టికే తెలంగాణ విష‌యంలో బీజేపీ ఎలాంటి రాజకీయాల‌ను చేస్తుందో చూస్తేనే స్ప‌స్టంగా అర్థం అవుతోంది. అయితే ఇప్పుడు ఏపీలో కూడా హిందూ రాజ‌కీయాలు రాజేసేందుకు రెడీ అవుతున్నారు క‌మ‌ల‌నాథులు. ప్ర‌స్త‌తుం వినాయ‌క చ‌వితి వేడుక‌లు వస్తున్న క్ర‌మంలో ఏపీలో ఉన్న ఆంక్ష‌ల‌పై వివాదం రాజేశారు సోమూ వీర్రాజు. ప్ర‌స్తుతం థర్డ్ వేవ్ సంకేతాలు వినిపిస్తున్న సంద‌ర్భంగా జగన్ సర్కార్ వినాయ‌క చ‌వితి వేడుకలపై ఆంక్షలు విధించింది.

ఇప్ప‌టికే క‌రోనా కార‌ణంగా ఏపీలో రాత్రి 11 గంటల నుంచి తెల్ల‌వారు జామున 6గంటల వ‌ర‌కు కర్ఫ్యూ కొన‌సాగుతుంద‌ని తెలిపింది ప్ర‌భుత్వం. దాంతో పాటు చవితి వేడుకల్లో క‌రోనా మ‌రింత ప్ర‌భ‌లే అవ‌కాశం ఉన్నందున ఏపీలో ఇండ్ల వ‌ర‌కే వేడుక‌ల‌ను పరిమితం చేయాలని ప‌బ్లిక్ తిరిగే ప్ర‌దేశాల్లో చవితి వేడుకలు చేయొద్ద‌ని సూచించింది. ఈ మేర‌కు ఆదేశాలు కూడా ఇస్తోంది. అయితే దీనిపైనే ఇప్పుడు బీజేపీ అగ్గి రాజేస్తోంది. ఏపీలో ఇంత‌కుముందు జ‌రిగిన ఏ పండుగల‌కూ లేని ఆంక్షలు కేవ‌లం చ‌వితి పండుగ‌కు ఎందుకు అంటూ మండిప‌డుతున్నారు. జ‌గ‌న్ స‌ర్కార్ హిందువుల పండుగలపై క‌క్ష గ‌డుతోంద‌ని చెప్తున్నారు. దీంతో ఇప్పుడు మ‌ల్లీ రాజ‌కీయ వేడి రాజుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news