బ్రేకింగ్: అమరావతిలో బిజెపి ఆఫీస్… ప్రకటించిన సోము…!

అమరావతి విషయంలో టిడిపి, వైసిపి కంటే మా బిజెపి స్పష్టమైన వైఖరి తో ఉంది అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రెండేళ్లలో ఇక్కడే సొంత పార్టీ కార్యాలయం కూడా ప్రారంభిస్తాం అని ఆయన ప్రకటన చేసారు. అమరావతి లో తొమ్మిది వేల ఎకరాలను‌ చంద్రబాబు అభివృద్ధి చేయాల్సి ఉన్నా చేయలేదని ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఎయిమ్స్ ను తక్కువ ఖర్చుతో కేంద్రం నిర్మాణం చేసి చూపించిందని చెప్పారు.

ఆనాటి, నేటి‌ ప్రభుత్వాలు కనీసం రోడ్ కు స్థలం ఇవ్వలేదన్నారు. రాజధాని‌ విషయం లో టిడిపి, వైసిపి లే ప్రజలను మోసం చేశాయన్నారు. హైకోర్టు రాయలసీమ లో ఉండాలని బిజెపి విధానానికి కట్టుబడి ఉందన్నారు. చంద్రబాబు రాజధానికి కేంద్రం కేటాయించిన నిధుల లెక్కలు చెప్పాలని డిమాండ్ చేసారు. జగన్ ప్రభుత్వం కూడా గొప్పలు‌చెప్పుకోవడం తప్ప..‌ చేతల్లో చూపించడం లేదన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టు లను వైసిపి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. గడ్కరీ.. స్వయంగా చంద్రబాబు ను విశాఖ పిలిపించి నిధుల పై‌ చర్చించారన్నారు.