బీజేపీ సూపర్ స్కెచ్… ఈసారి MIM పని అవుట్

-

దేశ వ్యాప్తంగా మోడీ హవా కొనసాగుతోంది. ఈ సమయంలోనే హైద్రాబాద్ పై పట్టు సాధించాలని బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.ఒక్కసారైనా హైదరాబాద్ ఎంపీ సీటు గెలవాలని ఆ పార్టీ అధిష్ఠానం గట్టి పట్టుదలగా ఉంది.ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్, అతని పార్టీకి చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది.ఇతర పార్టీల బలాన్ని అంచనా వేసి అందుకు అనుగుణంగా మహిళా అభ్యర్థిని రంగంలోకి దించింది భారతీయ జనతా పార్టీ.తొలి జాబితాలోనే హైద్రాబాద్ నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేసి ఎంఐఎం ని టార్గెట్ చేసింది బీజేపీ.అసదుద్దీన్ ఒవైసీ కోటను బద్దలు కొట్టేందుకు కొత్త వ్యూహాలను రచిస్తోంది.

హైద్రాబాద్ లో ఈసారి త్రిముఖ పోరు ఉంటుందని బీజేపీ అంచనా వేస్తోంది. కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ లేదా ఫిరోజ్ ఖాన్ అభ్యర్థులుగా నిలిస్తే భారీగా ముస్లింల ఓట్లు చీలే అవకాశం ఉందని బీజేపీ అంచనా వేస్తోంది.ఈ సమయంలో బలమైన, కొత్త ముఖాన్ని రంగంలోకి దించితే.. ఒవైసీ మీద గెలుపు సాధ్యమేనన్నది బీజేపీ భావన. తొలి నాళ్లలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన ఈ స్థానం 1984 నుంచి ఎంఐఎం చేతిలోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలో ఎక్కడా బీజేపీ ఉనికిలేని రోజుల్లోనూ ఈ స్థానంలో ఎంఐఎంకి గట్టి ప్రత్యర్థిగా బీజేపీ నిలుస్తూ వస్తోంది.ఇప్పుడు కొంపెల్ల మాధవీలత ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. పాతబస్తీలో మజ్లిస్ ను ఓడించచం కష్టమే కానీ అసాధ్యం కాదు. హిందూ ఓట్లు అన్నీ ఏకీకృతం అయితే చీలిపోకుండా చూసుకుంటే మజ్లిస్ కోటను బద్దలు కొట్టేయవచ్చు.ఇప్పుడు అదే పనిలో ఉంది బీజేపీ అధిష్టానం.

పాతబస్తీలోనే పుట్టి పెరిగిన మాధవీలత కోఠి మహిళా కళాశాల, నిజాం కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేశారు.భరతనాట్య కళాకారిణి కూడా. విరించి హాస్పిటల్స్ యజమానిగానే గాక మధు సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ అనే ఐటీ సేవల సంస్థతో పాటు అమెరికాలో ‘క్యూ ఫండ్‌’ అనే ఫిన్‌‌కార్ప్‌‌నూ నడుపుతున్నారు. ఈమె భర్త విశ్వనాథ్ కూడా వ్యాపారవేత్తే. మాధవీలత ‘లోపాముద్రా ఫౌండేషన్’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించి పాతబస్తీ కేంద్రంగా హెల్త్ క్యాంపులు,టైలరింగ్ కేంద్రాలు పెట్టి మహిళలకు శిక్షణనిచ్చి, వారికి తగిన పనిని ట్రస్ట్ తరఫున కల్పించటంతో పాటు ప్రజ్ఞాపూర్‌ దగ్గర 4 లక్షల చదరపు అడుగుల్లో గోశాలను నిర్మించి దేశవాళీ ఆవులను పరిరక్షించుకోవాలనే ప్రచారం చేస్తున్నారు. కొవిడ్ సమయంలోనూ తన సేవలతో మంచిపేరు తెచ్చుకున్నారు. సాధుసంతులతో కూడా సమావేశాలు పెట్టించటం, ధార్మిక ప్రవచనాలు ఏర్పాటు చేయించి పాతబస్తీలోని హిందూ ఓటర్లలో చైతన్యాన్ని కలిగిస్తున్నారు.ఈసారి తాను గెలుస్తాననే ధీమాను ఆమె వ్యక్తపరుస్తూన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news