పవన్ మౌన వ్యూహం – బీజేపీ ప్లానింగ్ ఇదే ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వర్సెస్ విజయసాయి రెడ్డి మధ్య తీవ్ర రాజకీయ పెను దుమారం రేగిన సంగతి మనకందరికీ తెలిసినదే. కరోనా వైరస్ రాపిడ్ టెస్టింగ్ కిట్లు దక్షిణ కొరియా దేశం దగ్గర కొనుగోలు విషయంలో భారీ అవినీతి జరిగిందని కన్నా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.Pawan Kalyan Agrees to Work with BJP 'Unconditionally'అయితే ఈ విషయంపై విజయసాయిరెడ్డి స్పందించి దేశంలో కరోనా వైరస్ కట్టడి చేయడంలో ఏపీ ప్రభుత్వ పనితీరుని అందరూ మెచ్చుకుంటున్నారు అని అన్నారు. కానీ ఇలాంటి సమయంలో తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలను ఖండించారు. అంతేకాకుండా కన్నా… చంద్రబాబు కి 20 కోట్లకు అమ్ముడు పోయారని షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది. విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర బీజేపీ నేతలు ఒక్కసారిగా సీరియస్ అయ్యారు.  రాష్ట్రంలో ఉన్న బిజెపి నేతలు అందరూ వరుసపెట్టి మీడియా సమావేశాలు నిర్వహించి విజయసాయిరెడ్డిని వైసిపి పార్టీ తీరుని తీవ్రస్థాయిలో విమర్శించారు.

 

ఇటువంటి సమయంలో బిజెపి పార్టీ తో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ చాలా మౌనంగా ఉండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ విజయసాయిరెడ్డి వర్సెస్ కన్నా లక్ష్మినారాయణ గా మాత్రమే చూస్తున్నారని కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ మౌనం వెనకాల బీజేపీ ప్లానింగ్ ఉందని అంటున్నారు. సరిగ్గా లాక్ డౌన్ అయిన వెంటనే ఈ గొడవ ని ఆధారం చేసుకుని వైసీపీ నీ ఇరుకున పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ తో బీజేపీ సరికొత్త ఎత్తుగడ వేయబోతున్నటు మరోపక్క వార్తలు వినబడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news