ఒకరి చావుకి కారణమైందని… మేయర్ జుట్టు కత్తిరించి… రోడ్ల మీదకు ఈడ్చారు…!

-

బొలీవియాలో అధ్యక్ష ఎన్నిక వివాదాస్పదంగా మారి అక్కడ తీవ్ర నిరసనలకు దారి తీసింది. పెద్ద ఎత్తున అక్కడి ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అక్కడ ఎన్నికల ఓట్ల లెక్కింపు 24 గంటల పాటు నిలిపేయడంతో ఆరోజు రాత్రి నుంచి ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేయడం మొదలుపెట్టారు. అలా ఓట్ల లెక్కింపుని ఎందుకు నిలిపివేస్తున్నారు అంటూ ప్రతిపక్ష అభ్యర్థి కార్లోస్ మెసా వర్గ౦ అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. 2006 నుంచి అధ్యక్షుడిగా ఉన్న మోరేల్స్‌కు అనుకూలంగా ఫలితాలను,

మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన మద్దతు దారులు రోడ్ల మీదకు వచ్చారు. ఎన్నికల ఫలితాల్లో మోరేల్స్ అవసరమైన మెజారిటీ కన్నా కేవలం 10శాతం పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారని తెలిసింది. దీనితో ఉద్యమం మొదలుపెట్టారు అక్కడి ప్రజలు. ఈ నేపధ్యంలో జరుగుతున్న నిరసనల్లో ఒక పరిణామం చోటు చేసుకుంది. అక్టోబర్ 20న జరుగుతున్న ఆందోళనల్లో వింటోలోని ఓ బ్రిడ్జిని ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారుల బృందం బ్లాక్ చేయడానికి ప్రయత్ని౦చగా… అధ్యక్షుడు ఇవో మొరేల్స్ మద్దతుదారులతో జరిగిన ఘర్షణల్లో,

ప్రతిపక్ష నిరసన కారులను చంపారని వార్తలు రావడం, దానికి కారణం మేయర్ ఆర్స్ అని తెలియడంతో వారు ఆమెను చుట్టూ ముట్టి, ఆమెపై రంగు నీళ్ళు జల్లి, చెప్పులు కూడా లేకుండా రోడ్డు మీద నడిపించుకుని వెళ్లి, జుట్ట కత్తిరించారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను హంతకురాలు అంటూ నిందిస్తూ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఆమెను మోకాళ్ళపై కూర్చోబెట్టి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేసారు. ఆమె కార్యాలయాన్ని దగ్ధం చేసి, టౌన్ హాల్ కిటికీలను నాశనం చేసి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news