బాబుచేతిలో బోండా ఉమకు వాయింపులు తప్పవా?

-

చాలామంది రాజకీయనాయకులు వారు ఏమి మాట్లాడుతున్నారు.. ఆ మాటల వల్ల తాము ఎలా ఇరుక్కుంటున్నారు అన్న ఆలోచనలు ఏమాత్రం చేయకుండా మాట్లాడుతుంటారు. మైకుదొరకడం ఆలస్యం.. అన్న చందంగా ప్రత్యర్ధులమీద విమర్శలు గుప్పించే క్రమంలో సెల్ఫ్ గోల్స్ వేసుకుంటుంటారు. వారిలో ప్రథమస్థానం కోసం పోటీ పడుతున్నారా అనేస్థాయిలో చెలరేగిపోతున్నారు టీడీపీ నేత బోండా ఉమ! తాజాగా వైకాపా ఎమంల్యే రోజా పై విమర్శలు గుప్పించాలని మైకందు కున్న ఆయన… అధికారంలో ఉన్నప్పుడు.. అతిముఖ్యమైన చీన చిన్న విషయాలను సైతం వారు ఎంతగా నిర్లక్ష్యం చేశారు అనే విషయం చెప్పకనే చెప్పారు.

వివరాళ్లోకి వెళ్తే… తనపై పూలుజల్లిన సంఘటనపై ఇప్పటికే నగరి ఎమ్మెల్యే రోజా క్లారిటీ ఇచ్చిన కూడా టీడీపీ నేతలు ఆ విషయాన్ని వదలడం లేదు! ఈ క్రమంలో కరోనా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి.. డ్యాన్సులు వేసుకుంటూ, పూలు జల్లుకుంటూ.. రూ. 2 లక్షలు ఖరీదు చేసే బోరు ప్రారంభోత్సవానికి ఇంత హడావిడి చేసింది అన్నట్లుగా విమర్శలు గుప్పించారు బోండా ఉమా మహేశ్వరరావు! దీంతో… తన అత్యుత్సాహంతో రోజాపై విమర్శలు గుప్పించే కార్యక్రమంలో భాగంగా… చంద్రబాబుని ఇరుకునపెట్టారు అని కామెంట్లు మొదలైపోయాయి. ఇంతకూ అదెలా అంటారా?

చిత్తురు జిల్లా లోని సుందరయ్య కాలనీలో సుమారు గత పదేళ్లుగా వారికి అక్కడ తాగునీటి సదుపాయం లేదంట! తన సొంత జిల్లాలో అంత సమస్య ఉన్నా కూడా చంద్రబాబు పట్టించుకోలేదనే విషయం దీంతో స్పష్టమవుతుంది. పోనీ… అదేమైనా రాష్ట్రబడ్జెట్ పై అధికభారం పడే పని కాబట్టి ప్రభుత్వం కాస్త వెనకా ముందూ ఆలోచించిందేమో అని అనుకుందామంటే… ఇంతకూ అందుకు అయ్యే ఖర్చు కేవలం రూ. 2 లక్షలు అని బోండా ఉమే చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో… ఒక కాలనీ మొత్తానికి నీరందించే పనికి రూ. 2 లక్షలు మాత్రమే ఖర్చవుతుందని తెలిసినా కూడా కనీసం వారు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో.. అది కూడా సాక్ష్యాత్తు నాటి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా ఆ సమస్యను పరీష్కరించలేని పాలన వారు అందించారనే విషయం చెప్పకనే చెప్పినట్లయ్యింది.

దీంతో… ఇలా లేనిపోని కామెంట్లు చేసి తనను ఇరుకునపెట్టే పనికి పూనుకుంటున్నాడని బోండా ఉమకు చంద్రబాబు చేతిలో వాయింపులు తప్పావ అనే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నాయి!!

Read more RELATED
Recommended to you

Latest news