ఆంధ్రప్రదేశ్ శాసన సభలో శాసన మండలి గురించి సుధీర్గ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. బిల్లులను ప్రవేశపెట్టిన 12 గంటలలోగా సవరణలు ఇవ్వాలని జగన్ అన్నారు. బుధవారం మండలిలో జరిగిన పరిణామాలు తనను బాధించాయని అన్నారు. రూల్స్ బుక్ కి వ్యతిరేకంగా మండలిలో బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపించారన్నారు. తప్పని తెలిసి కూడా,
విచక్షణాధికారం పేరుతో బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపడం అనేది ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడమే అన్నారు. ప్రజలకు మంచి జరగకుండా అడ్డుకుంటున్న మండలిని కొనసాగించాలా లేదా అనేది ఆలోచించాలి అని జగన్ అన్నారు. మండలి ఉండటం వలన ప్రజలకు మంచి జరుగుతుందో లేదో ఆలోచించాలి అన్నారు. మండలి కోసం ఏడాదికి 60 కోట్లు ఖర్చు చేస్తున్నామని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి,
మండలి న్యాయబద్దంగా చట్టబద్దంగా చేస్తుందని భావించామని, కాని తమ నమ్మకాన్ని ప్రజల నమ్మకాన్ని మండలి వమ్ము చేసిందని అన్నారు. అసలు మండలి అవసరం ఏంటో ప్రజలు ఆలోచించాలి అని జగన్ అన్నారు. మండలి కొనసాగాలా వద్దా అనేది సోమవారం చర్చించి నిర్ణయం తీసుకుందామని జగన్ అన్నారు. ఒక వ్యక్తి కోరిక మేరకు మండలి పని చేసింది అన్నారు. ఇక ఏపీ అసెంబ్లీని సోమవారానికి స్పీకర్ వాయిదా వేసారు.