బ్రేకింగ్; బిజెపికి తెలంగాణా ఎంపీ గుడ్ బై…?

-

జాతీయ పౌరసత్వ సవరణ చట్టం విషయంలో బిజెపి ఎంపీలు కూడా ఆగ్రహంగా ఉన్నారా…? ఢిల్లీ అల్లర్ల తర్వాత తాము కూడా నోరు విప్పితే బాగుంటుంది అని నేతలు భావిస్తున్నారా…? అంటే అవునేనే సమాధానం వినపడుతుంది. ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్ లో 40 మంది బిజెపి ఎమ్మెల్యేలు బిజెపి అధిష్టానం పై తమ అసహనం వ్యక్తం చేసినట్టు ప్రచారం ఎక్కువగానే జరుగుతుంది. దీనిపై వాళ్ళు రాజీనామా చెయ్యాలి అని నిర్ణయం కూడా తీసుకున్నారట.

ఇక తెలంగాణా లో కూడా బిజెపి నేతలు పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని అంటున్నారు. హైదరాబాద్ తర్వాత ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా కరీం నగర్. ఉమ్మడి జిల్లాలో ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉంది. అక్కడ మజ్లీస్ పార్టీకి బలం కూడా ఎక్కువగానే ఉంది. ఈ నేపధ్యంలోనే ఆ పార్టీ ఎంపీ గా ఉన్న బండి సంజయ్ బిజెపి అధిష్టానం కి ఇప్పటికే ఈ విషయంలో పలు విషయాలను కూడా పంపినట్టు సమాచారం.

తాజాగా ఆయన రాజీనామా చెయ్యాలని భావిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ఏ మాత్రం తెలంగాణాలో ప్రభావం చూపించ లేకపోవడానికి ఇదే ప్రధాన కారణమని సంజయ్ భావిస్తున్నారు. దీనితో రాజీనామా చేసే విధంగా ఆయన ముందుకి వెళ్తున్నారని, ఇప్పటికే తెలంగాణాలో మిగిలిన ఎంపీలకు కూడా ఈ విషయం చెప్పారని తెలుస్తుంది.

భవిష్యత్తు లో తెలంగాణా లో పార్టీ బలపడే అవకాశం కూడా లేదని ఈ తరుణంలో తన రాజకీయ భవిష్యత్తుని కాపాడుకుంటే మంచిది అనే నిర్ణయానికి ఆయన వచ్చారట. ఉగాది తర్వాత పార్టీకి రాజీనామా చేస్తారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. జాతీయ స్థాయిలో ఇప్పటికే ఈ చట్టం బిజెపి వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. దీనితోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి సిద్దమయ్యారని టాక్.

Read more RELATED
Recommended to you

Latest news