ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా గత అసెంబ్లీ సమావేశాలలో మూడు రాజధానుల బిల్లు మరియు సీఆర్డీఏ రద్దు బిల్లులను తెరపైకి తీసుకురావడం జరిగింది అసెంబ్లీలో ఆమోదం పొందిన ఈ బిల్లులు శాసన మండలి సభలో చైర్మన్ షరీఫ్ తన ప్రత్యేకమైన అధికారాన్ని ఉపయోగించి బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారు. దీంతో వైయస్ జగన్ ప్రతి విషయంలో ప్రభుత్వానికి అడ్డు పడుతోందని శాసనమండలిని రద్దు చేయడం జరిగింది.ఇది జరిగి నెల రోజులు కావస్తున్నా తరుణంలో త్వరలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ మాజీ మంత్రి యనమల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే బడ్జెట్ సమావేశాలు ముందు గవర్నర్ ప్రసంగంలో గత శాసనమండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు రాకూడదని ప్రభుత్వ పాలసీని రూల్-71కింద తిరస్కరించడం జరిగిందన్నారు. ఏ పాలసీలను మండలి తిరస్కరించిందో, వాటినే గవర్నర్ ప్రసంగంద్వారా ప్రభుత్వం తిరిగి సభల్లోకి తీసుకురావాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని యనమల తెలిపారు.
ఇదే సందర్భంలో గవర్నర్ కూడా తన సొంత అభిప్రాయాలు చెప్పారని ప్రభుత్వ ఆలోచనలు మరియు నిర్ణయాలే సభ ముందుకు వస్తాయని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఇదే సందర్భంలో శాసన మండలి రద్దు ఇంకా కాకపోవటంతో మరోపక్క చైర్మన్ షరీఫ్ కూడా మరో రూట్ లో సరికొత్త చట్టాన్ని ఉపయోగించుకొని జగన్ సర్కార్ ని ఇరికించాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే మరోపక్క వైయస్ జగన్ ప్రతిసారి తన నిర్ణయాలకు అడ్డు వస్తున్న మండలి చైర్మన్ షరీఫ్ కి బాంబు లాంటి న్యూస్ రెడీ చేశారని వైసీపీ పార్టీలో టాక్. విషయంలోకి వెళితే బడ్జెట్ సమావేశాల్లోనే శాసన మండలి రద్దు.. కేంద్రంలో అయ్యేవిధంగా జగన్ ప్రస్తుతం చక్రం తిప్పుతున్నట్టు సమాచారం.