ఈరోజు అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో చీకటి పాలన అంతమైనదని ప్రగతి భవన్ ఘడిలు బద్దలు కొట్టామని సామాన్య ప్రజలకు కూడా ముఖ్యమంత్రిని కలిసే విధంగా అవకాశం కల్పించామని తెలిపాడు. పారదర్శకంగా పరిపాలన అందించబోతున్నామని పేర్కొన్నాడు. ఒకప్పుడు హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ మరియు ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి ఈటెల రాజేందర్ లకి కూడా ప్రగతి భవన్ లోకి ప్రవేశం లేదని ప్రజా గాయకుడు గద్దర్ అన్నను కూడా ప్రగతి భవన్ గేటు ముందు నిల్చోబెట్టి తిప్పి పంపిన చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వానిది అని గుర్తు చేశాడు.
నిరంకుశ పాలన ఎక్కువ కాలం ఉండదని నిన్నటి వరకు అధికారంలో ఉన్న వారిని ఈరోజు ప్రజలు ప్రతిపక్షంలో ఉండేలా చేశారని అన్నాడు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు సంపత్ కుమార్ల శాసన సభ్యత్వం రద్దు చేసిన చీకటి రోజులను మర్చిపోలేమన్నారు. మేనేజ్మెంట్ కోటాలో గెలిస్తే ఇలానే ఉంటుందని మాజీ మంత్రి కేటీఆర్ కి చురకలు అంటించాడు. కరొన సమయంలో మందులను బ్లాక్ చేసినటువంటి వ్యాపారికి రాజ్యసభ సీటును 450 కోట్లకు అమ్ముకున్న ఘనత టిఆర్ఎస్ పార్టీది అని అన్నాడు.