విపశ్యన ధ్యాన కేంద్రానికి ఢిల్లీ సీఎం ?

-

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 10 రోజులపాటు విపస్యత ధ్యానానికి వెళ్ళనున్నారని అధికారులు వెల్లడించారు. ఢిల్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే డిసెంబర్ 19 నుంచి 10 రోజులపాటు ధ్యానానికి వెళ్ళనున్నారు. అయితే ఆయన ఏ ప్రదేశంలో ఉన్న సెంటర్ కు వెళ్ళనున్నారు అనేది మాత్రం బయటకు వెల్లడించలేదు. విపస్యన అనేది పురాతన భారతీయ ధ్యాన పద్ధతి. దీనిలో అభ్యాసకులు వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కోర్సు పూర్తయ్యే వరకు మాట్లాడటం ద్వారా లేదా సంఖ్యల ద్వారా సంభాషణకు దూరంగా ఉంటారు.

అభ్యాసకులు ధ్యాన కేంద్రం నుంచి బయటికి రావడం నిషిద్ధం. బయటి వ్యక్తులు కేంద్రంలోకి వెళ్లడం కూడా ఉండదు. చేసే వాళ్ళు చాలా కాలంగా విపస్యన సాధన చేస్తున్నారు. ఈ పురాతన ధ్యాన విధానాన్ని అభ్యసించడానికి గతంలో బెంగుళూరు, జైపూర్ తో సహా అనేక ప్రాంతాలకు వెళ్లారు. కేజ్రీవాల్ ప్రతి ఏడాది విపస్య ధ్యానం కోర్సుకు వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 30 వరకు ధ్యానంలో ఉంటారు అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news