ముధోల్ టూ కోదాడ వయా రామగుండం..కారులో రచ్చ.!

-

తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారం సొంతం చేసుకోవాలని కే‌సి‌ఆర్ గట్టిగా కష్టపడుతున్నారు. అటు కే‌టి‌ఆర్, ఇటు హరీష్ రావు..అభివృద్ధి పనులు చేస్తూ..మరోవైపు ప్రతిపక్షాలని కట్టడి చేస్తూ..ముందుకెళుతున్నారు. అయితే కొందరు నేతలు మాత్రం ఆధిపత్య పోరుతో  పార్టీని దెబ్బతీస్తున్నారు. ఇప్పటికే పలు స్థానాల్లో ఎమ్మెల్యేలకు, స్థానిక నాయకులకు పొసగడం లేదు. దీని వల్ల రచ్చ నడుస్తుంది. ఎమ్మెల్యేలకు మళ్ళీ సీటు ఇస్తే తామే ఓడిస్తామని బి‌ఆర్‌ఎస్ నేతలు అంటున్నారు.

ఈ క్రమంలో తాజాగా మూడు నియోజకవర్గాల్లో గులాబీ నేతలు రచ్చ లేపుతున్నారు. ముధోల్ లో ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. ఇప్పటికే కొందరు సీనియర్ నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లడానికి రెడీ అయ్యారు. మరికొందరు విఠల్ రెడ్డిని తప్పించాలని చెబుతూ..బి‌ఆర్‌ఎస్ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇద్దరు జెడ్‌పి‌టి‌సి సభ్యులు..ఇంకా పలువురు కీలక నేతలు కలిసి.. హైదరాబాద్‌కు వచ్చి పలువురు బి‌ఆర్‌ఎస్ నేతలని కలిసి ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని తప్పించాలని కోరారు. ఒకవేళ పోరాటపాటున ఎమ్మెల్యేకు సీటు ఇస్తే..వీరే ఓడించేలా ఉన్నారు.

brs party

ఇక రామగుండంలో అదే పరిస్తితి. ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు వ్యతిరేకంగా కొందరు నేతలు పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరకంగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే తమని పట్టించుకోవడం లేదని, ఎమ్మెల్యే తీరు వల్ల పార్టీకే నష్టం జరుగుతుందని అంటున్నారు. ఎమ్మెల్యే ఏమో..వ్యతిరేక వర్గాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయించడానికి చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా రామగుండంలో రచ్చ నడుస్తుంది.

అటు కోదాడలో మొదట నుంచి ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌కు వ్యతిరేకంగా కొందరు నేతలు ఉన్నారు. ఆయన బి‌ఆర్‌ఎస్ లో మొదట నుంచి ఉన్నవారికి కాకుండా…తనతో పాటు టి‌డి‌పి నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడుతున్నారు. ఈ సారి ఎమ్మెల్యేకు సీటు ఇవ్వకూడదని, సీటు ఇస్తే సహకరించమని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కోదాడ ఎమ్మెల్యే టికెట్‌ తనదేనని మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి అంటున్నారు. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న నాయకులకు కాదని, ప్రస్తుత ఎమ్మెల్యేకు టికెట్‌ ఇస్తే పార్టీకి ఓటు వేస్తాం కాని, ప్రచారం చేయబోమని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని బాబు చెబుతున్నారు. ఇలా  బి‌ఆర్‌ఎస్ పార్టీలో ఎక్కడకక్కడ రచ్చ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version