లేడీ ఫైటర్స్..ఈ సారి నెగ్గేది ఎవరో?

-

ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఏ అభ్యర్థి గెలుస్తారో అని రాజకీయ నాయకులలోను సామాన్య ప్రజలలోను ఆసక్తి పెరుగుతుంది తెలంగాణలో ఉన్న మహిళా నాయకులు గతంలో గెలిచి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు. మరి ఈసారి  ప్రజాదరణతో గెలుస్తారా లేదా అనే విషయాన్ని చూద్దామా.

మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబితా ఇంద్రారెడ్డి సెట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచి బిఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవిని ఇచ్చారు.  సబితా ఇంద్రారెడ్డికి సొంత పార్టీ లోనే  వర్గ పోరు ఎక్కువగా ఉంది. బిఆర్ఎస్ తరఫున మనోహర్ రెడ్డి టికెట్ ఆశిస్తుంటే, కృష్ణారెడ్డి తన కోడలు అనితకైనా టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మహేశ్వరంలో టిడిపి బిజెపి కూడా పట్టు సాధించటానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది.  మరి ఈ పోరులో ఈసారి సబిత గెలుపు కోసం కష్టపడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మెదక్ నియోజకవర్గం నుంచి పద్మా దేవేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున రెండుసార్లు గెలిచిన పద్మ ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ గెలుపును అందుకోవాలని ఆశపడుతున్నారు. కానీ సొంత పార్టీలోనే పద్మ దేవేందర్ రెడ్డి కి మద్దతు ఇచ్చేవారు తక్కువగానే ఉన్నారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా దేవేందర్ రెడ్డి పై వస్తున్న విమర్శలు, అవినీతి ఆరోపణలు పద్మ గెలుపు పై ప్రభావం చూపిస్తాయని రాజకీయ విశ్లేషకుల అంచనా.

Hari Priya

ఇల్లందు లో హరిప్రియ నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కమ్యూనిస్టులకు కంచుకోట. అక్కడ ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కమ్యూనిస్టుల సపోర్ట్ తోనే సాధ్యమవుతుంది. గత ఎన్నికలలో కాంగ్రెస్ తరపున హరిప్రియ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బి‌ఆర్‌ఎస్ అభ్యర్థి కనకయ్య ఓడిపోయారు. కానీ కాంగ్రెస్‌లో గెలిచిన హరిప్రియ బి‌ఆర్‌ఎస్ లోకి మారగా బి‌ఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన కనకయ్య ఇప్పుడు కాంగ్రెస్ తరపున పోటీకి సిద్ధంగా ఉన్నారు. అటు కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో కలిస్తే హరిప్రియ గెలుపు కాస్త కష్టమే.

Gongidi Sunitha

ఆలేరు నియోజకవర్గం నుంచి గొంగిత సునీత సిట్టింగ్ అభ్యర్డిగా ఉన్నారు. కేసీఆర్ కూతురుని అని చెప్పుకునే సునీత ఇప్పటికే రెండుసార్లు గెలిచారు. మూడోసారి గెలుపు సాధించాలని అనుకుంటున్నారు.మళ్ళీ ఆలేరు నుంచి సునీత రంగంలోకి దిగుతున్నారు. అయితే  నియోజకవర్గంలో అభివృద్ధి లేదని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. మరి ప్రతిపక్షాలకు గట్టిగా సమాధానం చెబుతూ ఈసారి ఆలేరులో సునీత విజయం సాధించాలంటే బిఆర్ఎస్ లో వర్గ పోరుకు స్వస్తి పలకాల్సి ఉంటుంది.

kova

ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ తరఫున కోవలక్ష్మి పోటీ చేస్తున్నారు. ఇది ఎస్టీ రిజర్వుడ్ ఇది కాంగ్రెస్ కు కంచుకోట. కమ్యూనిస్టుల ప్రభావం కూడా ఉంటుంది . అలాంటి చోట తెలంగాణ ఉద్యమ ప్రభావంతో బిఆర్ఎస్ తరఫున కోవ లక్ష్మీ  కాంగ్రెస్ అభ్యర్థి సక్కుపై గెలిచారు. కానీ 2018లో సక్కు ప్రతీకారం తీర్చుకుని కోవ లక్ష్మి పై విజయం సాధించారు. సక్కు గెలిచి బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. ఇక  సక్కు పై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో ఆత్రం సక్కుకు కే‌సి‌ఆర్ సీటు ఇవ్వలేదు. కోవ లక్ష్మీకి సీటు ఇచ్చారు. నియోజకవర్గం లో కోవ లక్ష్మి మంచు పట్టు సాధించారు. నియోజకవర్గ ప్రజలకు,పార్టీ నాయకులకు చేరువలో ఉంటూ కోవ లక్ష్మి ఈసారి గెలుపే లక్ష్యంగా  పావులు కదుపుతున్నారు.

 Lasya Nanditha

తెలంగాణలోని ప్రత్యేకమైన నియోజకవర్గం సికింద్రాబాద్ కంటోన్మెంట్. ఈ నియోజకవర్గం నుంచి సాయన్న వారసురాలిగా జి లాస్య నందితకి బిఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. సానుభూతి ఓట్లతో సాయన్న నియోజకవర్గం లాస్య నందిత గెలుపు సునాయాసమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

bade

ములుగు నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ బడే నాగజ్యోతిని తమ అభ్యర్థిగా ప్రకటించింది ఇప్పటికే ములుగు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సీతక్క సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలతో మమేకమవుతూ ముందుకు వెళుతున్న సీతక్క పై నాగజ్యోతి గెలుపు కష్టంతో కూడుకున్నదే అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం

Read more RELATED
Recommended to you

Latest news