టికెట్​పై అనుమానం.. పార్టీని వీడుతున్న బీఆర్​ఎస్ ఎంపీలు

-

బీఆర్​ఎస్ ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్​ వస్తుందనే నమ్మకం లేకపోవడమే ఇందుకు ప్రధానగా కనిపిస్తోంది. సిట్టింగ్​ ఎంపీల్లో ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే టికెట్​ హామీ లభించడం, మిగతా వారి అభ్యర్థిత్వాలపై పార్టీ అధినేత కేసీఆర్​ సైలెంట్​గా ఉండటంతో కొంత మంది ఎంపీలు తమ దారి తాము చూసుకుంటున్నారు.

brs party
brs party

గత లోక్​సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ తొమ్మిఇది ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. వీరిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరోవైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్​ నేత ఇప్పటికే పార్టీని వీడి కాంగ్రెస్​లో చేరారు. అదే వరుసలో నాగర్​కర్నూలు ఎంపీ పీ రాములు సైతం పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు. తాజాగా జహీరాబాద్​ ఎంపీ బీబీ పాటిల్​ సైతం బీఆర్​ఎస్​కు గుడ్​బై చెప్పారు. ఆయనకు పార్టీ కండువా కప్పి బీజేపీ జాతీయ అధ్యక్షుడు పార్టీలోకి ఆహ్వానించారు.

మిగిలిన ఐదుగురిలో సిట్టింగ్​ ఎంపీలు రంజిత్​రెడ్డి (చేవెళ్ల), నామా నాగేశ్వరరావు (ఖమ్మం)లకు మాత్రమే వచ్చే ఎన్నికల్లో పోటీకి కేసీఆర్​ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. మిగతా సిట్టింగ్​ ఎంపీలు పసునూరి దయాకర్​ (వరంగల్​), మాలోత్​ కవిత (మహబూబాబాద్​), మన్నె శ్రీనివాస్​రెడ్డి(మహబూబ్​నగర్)కి తిరిగి టికెట్​ లభించే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరికొంత మంది ఎంపీలు పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​, బీజేపీని ఢీకొట్టే సత్తాగల అభ్యర్థులను బరిలో దించడం లక్ష్యంగా కేసీఆర్​ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లోక్​సభ నియోజకవర్గాల వారీగా ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కసరత్తు ప్రాథమికంగా పూర్తిచేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సిట్టింగ్​లకు చాలా మందికి టికెట్​ కేటాయించకూడదనే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news