కాంగ్రెస్ కంచు కోటను బద్దలు కొట్టే పనిలో బీఆర్ఎస్

-

గిరిపై బిఆర్ఎస్ నేతలు గురి పెట్టారు.. ఎలాగైనా కాంగ్రెస్ కంచుకోట ను బద్దలు కొట్టాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.. ఈసారి కచ్చితంగా బద్దలు కొడతామని బీఆర్ఎస్ అధిష్టానానికి స్థానిక నేతలు లెక్కలు చెబుతున్నారట. ఇంతకీ టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్లమెంటు సీటు ఏది..?

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల కోసం బిఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది.. అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కంచు కోటగా ఉన్న భువనగిరి పార్లమెంటు స్థానంపై కన్నేసింది.. ఈసారి ఎలాగైనా కంచుకోటను బద్దలు కొట్టాలని తీవ్ర కసరత్తు చేస్తుంది.. తమకు టికెట్ ఇస్తే గెలిచి తీరుతామని ముఖ్య నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.. కాంగ్రెస్ కంచు కోటలో పాగా వెయ్యాలని అధిష్టానం పట్టుదలతో ఉందన్న సమాచారం తెలుసుకున్న ఆశావాహులు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ అగ్ర నేతల్ని కోరుతున్నారట..

బిఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతో పాటు మరో ఇద్దరు ఉద్యమ నేతలు ఉన్నారని పార్టీలో ప్రచారం జరుగుతుంది.. వరుసగా రెండుసార్లు భువనగిరి టౌన్ నుంచి గెలిచి.. గత ఎన్నికల్లో ఓటమిపాలైన శేఖర్ రెడ్డి.. టిక్కెట్ రేసులో ఉన్నారని జోరుగా ప్రచారం జరిగితుంది. తన మనసులోని మాటను కేటీఆర్ చెవిన వేశారట.. కార్యకర్తల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందని.. తనకు పార్లమెంట్ సీట్ ఇవ్వాలంటూ ఆయన అభ్యర్థించారట.. పనిలో పనిగా కేడర్ కు సంకేతాలు సైతం పంపారట..

మరోపక్క మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ సైతం తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలంటూ హైకమాండ్ ను కోరారని తెలుస్తుంది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేకు గెలిచిన బిక్షమయ్యగౌడ్.. బిఆర్ఎస్ పార్టీలో చేరారు.. ఆ సమయంలో ఎమ్మెల్సీ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని.. అది కుదరవకపోవడంతో ఎంపీ టికెట్ కావాలంటే అధిష్టానం పై ఒత్తిడి తీసుకొస్తున్నారట.. కాంగ్రెస్, బిజెపిలో కీలక నేతలుగా ఉన్న కొందరు తనకు సహకరిస్తారని.. తన సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువ ఉండడంతొ కచ్చితంగా గెలుస్తానని ఆయన లెక్కలు చెబుతున్నారని పార్టీలో టాక్ వినిపిస్తోంది.. అలాగే ఉద్యమ నేత చెరుకు సుధాకర్ జిట్టా బాలకృష్ణారెడ్డి సైతం టికెట్ రేస్ లో ఉన్నారని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతుంది.. వీరందరూ టికెట్ కోసం అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని బిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news