కరోనా దెబ్బకి ఏపీ ప్రజలకి బిగ్ బ్యాడ్ న్యూస్ !!

-

ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న పేరు కరోనా వైరస్. చైనా దేశంలో విజృంభిస్తున్న ఈ వైరస్ అనేకమంది ప్రాణాలను బలి తీసుకుంది. ప్రాణాంతకమైన ఈ వ్యాధి వల్ల చైనా దేశంలో దాదాపు ఏడు వేల మందికి పైగానే మరణించినట్లు సమాచారం. అంతేకాకుండా 65 వేల మందికి పైగా ఈ వైరస్ సోకినట్లు ఆ దేశంలో వార్తలు వస్తున్నాయి. ఒకరి నుండి ఒకరికి అంటు వ్యాధి లా ఈ ప్రాణాంతకమైన వైరస్ సోకడంతో చైనా దేశంలో రాకపోకలను ఆపివేశారు. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఎవరు కూడా వెళ్లకుండా ఆ దేశ అధికారులు ఏ ప్రాంతాన్ని ఆ ప్రాంతాన్ని కస్టడీలోకి తీసుకున్నారు. Image result for carona virus

దీంతో ఎవరు కూడా బయటికి రావడం లేదు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్లటం లేదు. అంతేకాకుండా చాలా దేశాలు చైనా దేశానికి విమాన సర్వీసులు చేసుకోవడం జరిగింది. దీంతో ఈ పరిస్థితి తో  చైనా దేశానికి ఎంతో ఆర్ధిక నష్టం కూడా జరుగుతుంది. ఇప్పటికే వివిధ ఉత్పత్తుల కంపెనీలు కూడా మూతపడ్డాయి. అయితే ఎన్నో కంపెనీలు మూతపడడంతో అటు వివిధ దేశాల పై కూడా ప్రభావం పడుతుంది. ఈ క్రమంలోనే వచ్చే వేసవి కాలంలో ఈ ప్రాణాంతకమైన కరోనా వైరస్ ఎఫెక్టుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కరెంటు కష్టాలు మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది.

 

కరోనా కి కరెంట్ కి సంబంధం ఏంటని మీకు డౌట్ రావచ్చు. మేటర్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు వచ్చే వేసవి కాలంలో ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పాటుగా రాష్ట్రంలో ట్రాన్స్ఫార్మర్లు వేసవి కాలానికి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే రాబోయే వేసవి కాలానికి తగ్గట్లు విద్యుత్ పరికరాలు మన దగ్గర లేకపోవడంతో పాటు చైనా నుంచి మనకు వచ్చే ఉత్పత్తులు కూడా ప్రస్తుతం ఆగిపోవటంతో కాబోయే వేసవిలో ఏపీకి భారీగా కరెంటు కష్టాలు ఉన్నట్లు సమాచారం. దీంతో కరోనా దెబ్బకి ఏపీ ప్రజలకి కరెంట్ కష్టాలు మొదలవటం అనేది పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. 

Read more RELATED
Recommended to you

Latest news