దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అల్లూరి సీతా రామరాజు గా రాం చరణ్, కొమరం భీం గా ఎన్.టి.ఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తెరకెక్కించగల సత్తా ఉన్న దర్శకుడిగా రాజమౌళి ఫేమస్ అయ్యారు. అంతేకాదు తెలుగు సినిమా రేంజ్ ని ఆకాశం అంత ఎత్తులో ఉంచిన సంగతి తెలిసిందే.
ఇక దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ చరణ్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక వాస్తవంగా ఈ సినిమా ఈ ఏడాది జూన్ లేదా జూలై లో రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే అనూహ్యంగా 2021 జనవరి సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు రాజమౌళి టీం రీసెంట్ గా అనౌన్స్ చేసి ప్రేక్షకులకు షాకిచ్చారు. అయితే దాదాపు ఆరు నెలలు ఆలస్యం అవడానికి కారణాలు చాలానే ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా సీజి అండ్ గ్రాఫిక్స్ వర్క్ కంప్లీటవకపోవడం తో పాటు ఇతర కారణాలు ఉన్నాయట.
ఇదిలా ఉంటే తాజాగా మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే ఆర్.ఆర్.ఆర్ మొదటి రోజు టికెట్ రేటు 1000/ రూపాయలు ఫిక్స్ చేయాలని జక్కన్న టీం అనుకుంటుందని. అయితే అసలు వాస్తవం ఏంటంటే జక్కన్న సన్నిహితులు బాహుబలి సినిమాకి మొదటి రోజు టికెట్ 2000/ నుండి 3000/ వరకు బ్లాక్ లో అమ్ముడయిన కారణంగా ఖచ్చితంగా ఆర్.ఆర్.ఆర్ కి మంచి క్రేజ్ అండ్ బజ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ డే 1000/ రూపాయలు ఫిక్స్ చేస్తే బావుంటుందని సలహాలిస్తున్నారట.
అయితే దీని మీద ఇంకా జక్కన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం లేదు. అయితే మల్టీప్లెక్స్ లో 500/ నుండి 1000/ సింగిల్ స్క్రీన్స్ లో 300/ ఫిక్స్ చేస్తే అందరికి టికెట్ రేటు అందుబాటులో ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిమీద తుది నిర్ణయం జక్కనదేనని ఆయన ఏం డిసైడ్ చేస్తారో అని అంటున్నారు. ఇప్పుడిది ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.