ఏపీ కి మరొక షాకింగ్ న్యూస్ మోసుకొచ్చిన కరోనా ??

-

ప్రపంచం మొత్తాన్ని గజగజ వణికిస్తోంది కరోనా వైరస్. దాదాపు 70 దేశాలకు పైగానే కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు అంతర్జాతీయ సంస్థల లెక్కల్లో తేలింది. ముఖ్యంగా ఇటలీ ప్రాంతంలో ఈ వ్యాధి ప్రభావం గట్టిగా కనబడుతుంది. ఒక్కరోజులోనే ఆరు వందల మందికి పైగానే ఈ కరోనా వైరస్ వ్యాధి వల్ల చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. భారత్ లో కూడా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఈ వ్యాధి బయటపడింది. Image result for caroona virusఇటలీ నుండి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ ఉందని తేలడంతో అతన్ని ఇన్సులేషన్ రూమ్ లో ఉంచడం జరిగింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇటువంటి తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో ఏపీకి కరోనా షాకింగ్ న్యూస్ తెచ్చినట్లు అయ్యింది. మేటర్ లోకి వెళ్తే ఇప్పుడు ఈవీఎంలు ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే ఖచ్చితంగా ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని కొత్త విషయం బయటపడింది.

 

దీంతో ఇప్పుడు బ్యాలెట్ తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి దారులు వెతుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రిజిస్టర్ వాడాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తంబు ఇంప్రెషన్ తీసివేయడం జరిగింది. మరోపక్క నెల్లూరు జిల్లాలో అన్ని సినిమా హాలు అదేవిధంగా షాపింగ్ మాల్స్ మొత్తం క్లోజ్ అయ్యాయి. 

 

Read more RELATED
Recommended to you

Latest news