కరోనా నిబంధనలను ఉల్లంఘించిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేయాలని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు నిబంధనలు అమలులో ఉన్నా.. మంత్రి కేటీఆర్ నల్లగొండ జిల్లాలో ర్యాలీలు, సమావేశాలను ఎలా నిర్వహిస్తారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్స్ అన్ని ప్రతిపక్షాలకే ఉంటాయా.. అధికారిక పార్టీలకు ఉండవా.. అని ప్రశ్నించారు. రైతుల కోసం, ప్రజల కోసం తము ఎదీ చేసిన పాప కార్యాలు.. మీరు అధికారంలో ఉండి సమావేశాలు, ర్యాలీలు చేస్తే పుణ్య కార్యాలా అని షర్మిల ప్రశ్నించారు.
తాము రైతు ఆవేదన యాత్ర చేస్తే.. కరోనా నిబంధనలు అడ్డువచ్చాయి.. కానీ మంత్రి కేటీఆర్ సభలకు ర్యాలీలకు కరోనా నిబంధనలు అడ్డురావా అని అన్నారు. కరోనా నిబంధనలు పాటించన మంత్రి కేటీఆర్ పై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయాలదని షర్మిల అన్నారు. తెలంగాణలో ప్రజా స్వామ్యం ఉందని పోలీసులు నిరూపించాలని అన్నారు. మంత్రి కేటీఆర్ కరోనా నిబంధనలు పాటించకపోవడంతో ఆయన పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.