క‌రోనా వైర‌స్ వ్యాప్తిపై రాష్ట్రాల‌కు కేంద్రం కీల‌క ఆదేశాలు

-

గ‌త కొద్ది రోజుల నుంచి దేశంలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది. అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు క‌రోనా వైర‌స్ వ్యాప్తిపై అన్ని రాష్ట్రాల‌తో పాటు అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల ప్ర‌భుత్వాల‌కు కీలక ఆదేశాల‌ను జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ భూష‌ణ్ ఈ రోజు అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శుల‌కు లేఖ రాశారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఈ మ‌ధ్య కాలంలో విప‌రీతంగా పెరుగుతున్న నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాల‌లో తాత్కాలిక ఆస్ప‌త్రులు ఏర్పాటు చేయాల‌ని సూచించారు.

అలాగే క‌రోనా సోకి హోం ఐసోలేష‌న్ లో ఉంటున్న వాళ్ల‌ను రెగ్యూల‌ర్ గా ప‌ర్య‌వేక్షించేందుకు ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. అలాగే క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో జిల్లా స్థాయి లేదా స్థానికంగా కంట్రోల్ రూం ల‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. అలాగే క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌ను పెంచాల‌ని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఉన్న అంబులెన్స్ లు, హాస్ప‌టల్ బెడ్ లు, ఆక్సిజ‌న్ బెడ్ ల‌పై ప్ర‌జ‌లకు తెలిసే ప్రచారం చేయాల‌ని సూచించారు. అలాగే రాష్ట్రాల‌లో క్వారంటైన్ కోసం అన్ని సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news