దిశ అత్యాచారం హత్య ఘటన దేశంలోనే సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసినదే. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన పై దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న చట్టాల పై తీవ్ర వ్యతిరేకత రావడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘటన జరిగిన సందర్భంలో అసెంబ్లీలో ఘటనకు పాల్పడిన నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసిన తెలంగాణ పోలీస్ వ్యవస్థకి మరియు కెసిఆర్ గవర్నమెంట్ కి హ్యాట్సాఫ్ తెలిపారు.
అయితే ఇలాంటి ఘటన ఆంధ్ర రాష్ట్రంలో జరగకూడదని ఆంధ్రరాష్ట్ర మహిళల భద్రతపై దిశ చట్టం పేరుతో చట్టాన్ని తీసుకొచ్చారు. తాజాగా దిశ చట్టానికి సంబంధించిన బిల్లు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉండిపోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ దిశ చట్టంలో కొన్ని సవరణలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది.
ఇటువంటి పరిస్థితుల్లో ఒకపక్క చట్టాన్ని తీసుకు వచ్చిన జగన్ ప్రభుత్వం తాజాగా దిశ పోలీస్ స్టేషన్లను రాష్ట్రవ్యాప్తంగా నెల కలపడంతో ” చాలా గొప్ప పని చేస్తున్నారు ” అంటూ జగన్ సర్కార్ పై కేంద్ర ప్రభుత్వ పెద్దలు పొగడ్తల వర్షం కురిపించారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్ నీ ఓపెనింగ్ చేయటంతో ఈ వార్త హైలెట్ అవడంతో కేంద్రంలో ఉన్న పెద్దలు మరియు జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.