ఏపీలో జగన్ దే అధికారం… సర్వే ఫలితాలు విడుదల చేసిన సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్

-

ఈసారి ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమని సర్వే వెల్లడించింది. ఈ సంస్థ ఏపీలో సర్వే నిర్వహించింది. ఈసందర్భంగా సర్వేలో జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఖచ్చితంగా గెలుస్తుందని సీపీస్ ప్రతినిధి వేణుగోపాల్ రావు వెల్లడించారు.

ఇదివరకు అత్యంత ఖచ్చితత్వంతో కూడిన సర్వే ఫలితాలను విడుదల చేసిన సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్(సీపీఎస్) సంస్థ తాజాగా ఏపీకి సంబంధించిన సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఆ ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

ఈసారి ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమని సర్వే వెల్లడించింది. ఈ సంస్థ ఏపీలో సర్వే నిర్వహించింది. ఈసందర్భంగా సర్వేలో జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఖచ్చితంగా గెలుస్తుందని సీపీస్ ప్రతినిధి వేణుగోపాల్ రావు వెల్లడించారు.

ఆయన సారధ్యంలో సీపీస్ ఏపీలో రెండు సార్లు సర్వే నిర్వహించింది. ఫస్ట్ సర్వే ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు నిర్వహించగా… అందులో 4,37,642 శాంపిల్స్ తీసుకున్నారు. రెండో సర్వేను మార్చి 27 నుంచి 31 వరకు నిర్వహించగా… అందులో 3,04,323 శాంపిల్స్ తీసుకున్నారు.

రెండు సర్వేల ప్రకారం వైఎస్సాఆర్సీపీకి 48.1 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీకి 40.1 శాతం, జనసేనకు 8 శాతం ఓట్లు వచ్చాయి. వైఎస్సార్సీపీ 121 నుంచి 130 స్థానాల వరకు గెలుస్తుందని సర్వే వెల్లడించింది. టీడీపీ 45 నుంచి 54 స్థానాలు, జనసేకు ఒకటి రెండు స్థానాలు వస్తాయని సర్వే స్పష్టం చేసింది.

జగన్ నే నమ్ముతున్న ఏపీ ప్రజలు

ఏపీ ప్రజలు జగన్ నే నమ్ముతున్నారని సర్వే వెల్లడించింది. చంద్రబాబు నాయకత్వంపై 39 శాతం ప్రజలు విశ్వాసం ఉంచగా… జగన్ పై మాత్రం ఏకంగా 46 శాతం మంది ప్రజలు నమ్మకంగా ఉన్నారని సర్వే వెల్లడించింది. మరోవైపు మధ్యలో వచ్చిన పవన్ కల్యాణ్ ప్రభావం ఏమాత్రం ఉండబోదని ఈ సర్వే స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version