ఐటి దాడులంటే బాబుకు భ‌య‌మెందుకు?: జీవీఎల్‌

-

అమ‌రావ‌తి(ఏలూరు): బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చంద్ర‌బాబునాయుడుపై మండిపడ్డారు. ప్రజల సమస్యల గురించి ఏనాడు కేబినెట్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయలేదని.. కానీ ఐటీ దాడుల నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై అత్యవ‌స‌ర‌ మీటింగ్‌ పెట్టడం సిగ్గుచేటన్నారు. టీడీపీని భూస్థాపితం చేసే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద బీజేపీ ప్రజా ఆవేదన ధర్నా నిర్వ‌హించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, పురంధేశ్వరి, జీవీఎల్‌, మాణిక్యాలరావు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో సీనియర్‌నని చంద్రబాబు విర్రవీగుతున్నారన్నారు. అవినీతిపరులపై ఐటీ దాడులు జరిగితే.. తమపై జరిగిన దాడులుగా టీడీపీ వక్రీకరిస్తోందని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వానికి ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుకు సిగ్గు లేదని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. ఇసుక అక్రమ రవాణాలో చాలా దారుణాలు జరుగుతున్నాయని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలు వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఓ రేటు ఫిక్స్‌ చేసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను కూడా అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఇక పోలవరం ప్రాజెక్టు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో బ్రోకర్లు తయారయ్యారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version