ఏపీ అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుటుంబం కొనుగోలు చేసిన భూముల వివరాలను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు కుటుంబం భారీ భూముల కుంభకోణానికి ఎలా పాల్పడిందో లెక్కలతో సహా, సర్వేనంబర్లతో సహా ఆర్థిక మంత్రి ప్రకటించడం విశేషం. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే ఎంతటి భూములను కొనుగోలు చేసి ఇన్‌సైడ్ ట్రైడింగ్ కు ఎలా పాల్పడినాడో స్పష్టం అయింది. చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో భూములు కొనుగోలు చేసినట్లు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు కావడంతో టీడీపీ ఇరుకున పడిందనే చెప్పవచ్చు.
ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఎలా జరిగిందో, ఎవరెవరు కొనుగోలు చేశారో సర్వేనంబర్లు, రిజస్ట్రేషన్ నంబర్లు, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేశారో వివరాలు పూసగుచ్చినట్లు వివరించారు. ఏపీలో ఇప్పుడు అమరావతి పేరుతో జరుగుతున్న ఆందోళన కు టీడీపీ చేస్తున్న యాగిని అసెంబ్లీ సాక్షిగా తేటతెల్లం చేశారు. చంద్రబాబు అమరావతికి సమీపంలోని తాడికొండ మండలంలోని కంటేర్ విలేజ్ లో చంద్రబాబు నాయుడు 14.20 ఎకరాలను హెరిటేజ్ పేరిట భూములను కొనుగోలు చేసినట్లు ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీ ప్రకటించారు.
ఆయన కుటుంబ కూడా ఇంకా ఎక్కడెక్కడ భూములు కొనుగోలు చేశారు కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. చంద్రబాబు నాయుడు తో పాటుగా టీడీపీలో ముఖ్య అనుచరుడు లంక దినకర్ తుళ్ళూరు విలేజ్‌లో కొనుగోలు చేశారు. వేమూరి రవికుమార్ ప్రసాద్, రాజధాని ప్రకటించకముందు కొనుగోలు చేసిన భూములు. అతి ముఖ్యమైన నేత మాజీ మంత్రి పరిటాల సునితమ్మ ధరణికోటలో కొడుకు, అల్లుడు పేరుతో ఉన్న కంపెనీ పీఆర్ ఇన్‌ఫ్రా పేరుతో భూములు కొన్నట్టు చెప్పారు.
గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీఎస్ అంజనేయులు, ప్రస్తుత పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్, దూళిపాళ్ళ నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్‌రావు కూతురు స్వాతి పేరుతో, మాజీ టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ కుమారుడు, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్‌యాదవ్, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, కొమ్మలపాటి శ్రీధర్, దివంగత మాజీ స్పీకర్ కోడేల శివ ప్రసాద రావు కుటుంబ నుంచి భారీగానే భూములను కొనుగోలు చేశారు. మాజీ ఎంపీ మురళీమోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు ఇంకా అనేకమంది పేర్లను ఈ సందర్బంగా ప్రకటించారు బుగ్గన.