కందుకూరు టిడిపి ఇన్చార్జికి చెక్ పెట్టిన చంద్రబాబు.. గ్రూపు రాజకీయాలకి ఆజ్యం పోస్తున్నారా?

-

కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్న కందుకూరు నియోజకవర్గం లో తాజాగా ఓ చర్చ టిడిపిలో హాట్ టాపిక్ గా మారింది.. ఇన్చార్జిగా ఉన్న ఇంటూరి నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా ఆయన యాంటీ వర్గం దుష్ప్రచారాలకు పాల్పడుతుంది. గత ఏడాది చంద్రబాబు బహిరంగ సభలో 9 మంది ప్రాణాలు కోల్పోవడానికి ఇంటూరి నాగేశ్వరరావు నిర్లక్ష్యమే కారణమని ఆయన అసమ్మతి వర్గం నేతలు ప్రచారాలు చేస్తున్నారు.

ఈ అసమ్మతి వర్గానికి నాయకుడుగా ఉన్న ఇంటూరి రాజేష్ టిక్కెట్ కోసం ఇలాంటి ప్రచారాలకి నాయకత్వం వహిస్తున్నారని నాగేశ్వరరావు వర్గం భావిస్తుంది.. 2014లో టిడిపి తరఫున బరిలోకి దిగిన పోతుల రామారావు.. 2019లో ఓటమిపాలయ్యారు.. ఓటమి అనంతరం ఆయన రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. దీంతో టిడిపి అధిష్టానం ఇంటూరి నాగేశ్వరరావును ఇన్చార్జిగా ప్రకటించింది. అప్పటి నుంచైనా కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అతనికి టికెట్ రాకుండా చేసేందుకు ఇంటూరి రాజేష్ నాగేశ్వరరావు పై దుష్ప్రచారం చేయిస్తున్నారని.. దానికి చంద్రబాబు నాయుడు అండగా ఉన్నారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

వివాదాలకు దూరంగా ఉండే ఇంటూరి నాగేశ్వరరావు పై అసమ్మతి వర్గం పథకం ప్రకారం చెడ్డపేరు తీసుకువచ్చేందుకు దుష్ప్రచారం చేస్తుందట. అసమ్మతి వర్గంగా ఉన్న ఇంటూరి రాజేష్, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు ఒక వర్గంగా ఉంటే.. మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, రాష్ట్ర పార్టీ మహిళా నేత ఉన్నం నళినీ దేవి మరో వర్గంగా ఉన్నారు.. వీరందరూ కూడా నాగేశ్వరావు కి చెక్ పెట్టి టికెట్ తెచ్చుకోవాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో ఎవరికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారో తెలియక పార్టీ క్యాడర్ అయోమయంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news