చింత‌మ‌నేని ఇంట్లో చంద్ర‌బాబు… ఆ భ‌య‌మే కార‌ణ‌మా…!

-

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేనిని ఇంటికి వెళ్లి స్వ‌యంగా ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా అధికార పార్టీ నేతలు పోలీస్ వారిచే ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసి 66 రోజుల పాటు జైలు శిక్ష విధించారంటూ చింత‌మ‌నేని ప్రభాకర్ కు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు చేసిన వ్యాఖ్యలు ఇవి. దాదాపు రెండు నెలల అనంతరం జైలు నుంచి బెయిల్ మీద విడుదలైన చింతమనేని ప్రభాకర్ ను కలిసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా వెళ్లారు. చింత‌మ‌నేనికి ధైర్యం చెప్ప‌డంతో పాటు తాను ఉన్నానంటూ భ‌రోసా ఇచ్చారు.

ఇక చింత‌మ‌నేని జైల్లో ఉంటే చాలా మంది పార్టీ నేత‌లు వ‌చ్చి ప‌రామ‌ర్శించినా చంద్ర‌బాబు ఆయ‌న జైలు నుంచి విడుద‌ల‌య్యాక కాని రాలేదు. దీనిపై చింతమనేని పట్ల చంద్రబాబుకు గల అభిమానాన్ని చాటుకున్నారు అని కొందరు అంటుంటే… మరి కొందరు రకరకాల ఆలోచనలు…. అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచే నాయకులను కాపాడుకోవడానికి బాబు గారు చేస్తున్న ప్రయత్నం అని ఆ పార్టీ నాయకులే చెపుతున్నారు.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు అవినాష్‌, వంశీ లాంటి వాళ్ల విష‌యంలో వాళ్ల అసంతృప్తి బాబు ముందే ప‌సిగ‌ట్టి పిలిచి మాట్లాడితే స‌రిపోయేది. కానీ అది క‌రువు అవ్వ‌డంతోనే వాళ్లు పార్టీ మారిపోయారు. కీల‌క నాయ‌కులు వెళ్లిపోతుండ‌డంతో… తీవ్రమవుతున్నటు వంటి నాయకుల కొరత తెలుగుదేశం పార్టీలో ఉన్న కారణంగా మిగిలిన వారిలోనైన పార్టీ అధ్యక్షుడు గా భరోసా ఇచ్చి వారిలో ధైర్యాన్ని నింపే పనిలో ఉన్నారని అంటున్నారు. చింతమనేని ప్రభాకర్ విషయంలో వారం క్రితం వరకు చాలా లైట్ తీస్కొన్న చంద్రబాబు …వంశీ వ్యవహారం తర్వాత అనూహ్యంగా వెళ్లి ఆయన్ను… పార్టీ సమీక్షా సమావేశం పేరుతో కలిశారు.

దీని వెనుక ఉన్న నేతలను కాపాడుకోవడానికే అనేది స్పష్టంగా అర్ధమవుతోంది. అందుకే చంద్రబాబు తీవ్రంగా శ్రమించి మరీ ఆయన ఇంట్లో అంత సేపు గడిపారని కుటుంబ విషయాలు తెలుసుకున్నారని అంటున్నారు. ఏది ఎలా వంశీ పార్టీకి వ్యతిరేకంగా మారిన తర్వాత చంద్రబాబులో వచ్చిన ఈ అనూహ్య మార్పు మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాను ఇప్ప‌ట‌కి అయినా స్పందించ‌క‌పోతే చింత‌మ‌నేని కూడా జంప్ చేస్తాడ‌న్న డౌట్ బాబుకు వ‌చ్చేసిన‌ట్లే క‌న‌ప‌డుతోంద‌ని పార్టీ వ‌ర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. మరి భవిష్యత్తులో వెళ్లే వాళ్ళను కూడా ఇలాగే కాపాడుకుంటారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news