బాబుకి ఇంకా కేసీఆర్ భయం పోలేదా?

-

గతకొన్నిరోజులుగా చంద్రబాబు మాట్లాడుతున్న మాటలను సరిగ్గా గమనిస్తే… ఒక విషయంపై క్లారిటీ వస్తున్నట్లుంది అంటున్నారు తెలంగాణలోని బాబు ఫ్యాన్స్!! కరోనా పుణ్యమాని ఏపీలో అడుగుపెట్టే అవకాశం కోల్పోయిన చంద్రబాబు… ప్రస్తుతం ఫ్యామిలీతో హైదరాబాద్ లోనే రెస్ట్ తీసుకుంటున్నారు! ఈ క్రమంలో అప్పుడప్పుడూ వీడియో కాంఫరెన్స్ లు కండక్ట్ చేస్తూ… తాజాగా ఆన్ లైన్ ప్రెస్ మీట్ పెట్టారు! ఈ క్రమంలో ప్రసంగం మొదలైనప్పటినుంచి, ముగిసే వరకూ కరోనాపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, అందుకే కేసులుపెరుగుతున్నాయని, తన సూచనలను పట్టించుకోవడంలేదని… విమర్శలు చేశారు! కానీ… ఏపీకంటే ఎక్కువగా కేసులు నమోదవుతున్న తెలంగాణ విషయంలో మాత్రం నోరుమెదపలేదు! ప్రస్తుతం ఇదే విషయంపై రాజకీయ వర్గాలతోపాటు జర్నలిస్టుల సంభాషణల్లో కూడా ఈ విషయంపై తెగ చర్చోపచర్చలు నడుస్తున్నాయి.

అవును… ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అడపాదడపా తెలంగాణా విషయాలపైనా, తెలంగాణలోని సమస్యలపైనా కాస్తో కూస్తో స్పందించారు చంద్రబాబు. అయితే… 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం మాత్రం… అసలు చంద్రబాబు నోటి నుంచి తెలంగాణ అనే మాటే రావడం మానేసింది అనే అనుకోవాల్సిన పరిస్థితి. టీడీపీ అనేది జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నప్పుడు.. దేశం మొత్తం గురించి మాట్లాడలేకపోయినా, ఇంతకాలం కలిసి ఉండి ఒకే బాష మాట్లాడే పక్క రాష్ట్రంపై.. చంద్రబాబు స్పందించకపోవడం నిజంగా దారుణమనే చెప్పాలి! “స్పందించడం అంటే… విమర్శించడమేకాదు” అని గ్రహించలేకపోయారో లేక ఏమి మాట్లాడితే ఏమి అవుతుందో అని వెనక్కి తగ్గారో తెలియదు కానీ… ఒక్కటంటే ఒక్కమాట కూడా మాట్లాడలేదు!

సరిగ్గా గమనిస్తే… చంద్రబాబు మాటల్లో తేడా ఇట్టే అర్ధం అవుతుంది! ఏపీ కంటే ప్రస్తుతం చంద్రబాబు తలదాచుకుంటున్న తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ! ఇదే క్రమంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యేందుకు పడుతున్న సమయం రిపోర్ట్ లో కూడా ఏపీలో 10.6 రోజులు పడుతుండగా… తెలంగణలో 9.4 రోజులే పడుతుంది. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ! అయినా కూడా తెలంగాణ సర్కార్ విషయంలో చంద్రబాబు.. విమర్శలు చేయలేకపోయినా కనీసం ఒక్క సూచన కూడా చేయలేని పరిస్థితి! దీనికి కారణం కేసీఆర్ అంటే చంద్రబాబుకి భయం పోకపోవడమా లేక… తెలంగాణను చంద్రబాబు పూర్తిగా వదిలేసుకోవడమా? ఏది ఏమనుకోవాలో తెలియక బాబు ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారట!

కాకపోతే… ప్రతిపక్షాలు చెప్పే మాటలు విని, జాగ్రత్తలు పాటించిన రాష్ట్రాల్లో మాత్రం కరోనా తీవ్రత తక్కువగా ఉందని… ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని మాత్రం ఒక మాట వదిలారు చంద్రబాబు! మరి ఈ మాట ఏ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నారో చంద్రబాబుకే తెలియాలి!!
దీనికి కారణం కేసీఆర్ అంటే చంద్రబాబుకి భయం పోకపోవడమా (ఓటుకు నోటు సమయంలో ఏర్పడినది అని చెబుతున్నట్లుగా!) లేక… తెలంగాణను చంద్రబాబు పూర్తిగా వదిలేసుకోవడమా? ఏది ఏమనుకోవాలో తెలియక బాబు ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారట!

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version