ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది.. అమరావతి నిర్మాణంతో పాటు.. సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు అవరసమైన నిధులను సమకూర్చుకుంటోంది.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తక్కువ సమయమే కావడంతో అందరూ పాలన మీద దృష్టి పెట్టారు.. ఈ క్రమంలో వైసీపీ యాక్టివ్ అవుతోంది.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పడిలేచిన కెరటం లాగా పోరాటాలకు సిద్దమవుతున్నారు.. ఇది టీడీపీ అధినేత చంద్రబాబుకు మింగుడు పడటం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు..అనంతరం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు.. ఈ భేటీ అంతా నిధులు, పరస్పర సహకారాలు అనేది తెలుగుదేశం పార్టీ నేతలు బయటికి చెబుతున్న మాట.. కానీ ఇంటర్నల్ గా జగన్మోహన్ రెడ్డే లక్ష్యంగా చంద్రబాబునాయుడు ఢిల్లీకి వచ్చారని హస్తినలో టాక్ నడుస్తోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసిన అంశంతో పాలు పలు విషయాలు ప్రధానితో చంద్రబాబు చర్చించారనే ప్రచారం ఊపందుకుంది..
ఇండియా కూటమికి జగన్ దగ్గరవుతున్నారని మోడీ దృష్టిలో పెట్టి.. అతనిపై ఉన్న కేసులను తిరగతోడాలనే విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారని.. తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.. ఆదిలోనే జగన్మోహన్ రెడ్డి దూకుడుకు అడ్డుకట్ట వెయ్యకపోతే.. ఏపీలో కూటమి పార్టీలకు మనుగడ కష్టమని మోడీవద్ద ప్రస్తావించారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.. జగన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది.. చంద్రబాబును నమ్ముకుని.. జగన్ ని దూరం చేసుకోవడం సరైనది కాదనే భావనలో కమలనాధులు ఉన్నారనే చర్చ నడుస్తోంది.. మొత్తంగా చంద్రబాబు పర్యటన సారాంశం కొద్ది రోజుల్లో తెలిసే అవకాశముంది..