టీటీడీపీ కొత్త త‌మ్ముడు ఆయ‌నేనా.. చంద్ర‌బాబు డిసైడ్ అయ్యారా..?

రాష్ట్రం ఏర్ప‌డ్డ త‌ర్వాత తెలంగాణ‌లో ఏ మాత్రం పోటీ చూప‌ని టీటీడీపీ ప‌రిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డ్డ‌ట్టు అయింద‌నే చెప్పాలి. ఎందుకంటే మొన్న‌టి దాకా పార్టీకి అంతో ఇంతో పేరు వినిపిస్తున్న ఎల్‌.ర‌మ‌ణ ఇప్పుడు రాజీనామా చేయ‌డంతో కొత్త త‌మ్ముడి కోసం చంద్ర‌బాబు వేట కొన‌సాగిస్తున్నారు. అయితే ఈ ప‌ద‌వికి ఎంతోమంది పోటీప‌డుతున్న‌ట్టు ఏదో మాయ క్రియేట్ చేస్తున్నారు చంద్ర‌బాబు.

ఇక ఏదేమైనా తెలంగాణ టీడీపీకి కొత్త బాస్‌ను నియమించడానికి రెడీ అయ్యారు మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగానే రీసెంట్ గా తెలంగాణ టీడీపీ ముఖ్య నాయ‌కుల‌తో చంద్రబాబు సమావేశమై అన్ని విష‌యాల‌పై కూలంకుంషంగా చ‌ర్చించి చివ‌ర‌కు ఒకరిని అధ్యక్షుడిగా నియమించడానికి డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది.

ఆయ‌నెవ‌రో కాదు మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులే అని తెలుస్తోంది. నర్సింహులు మొద‌టి నుంచి చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉంటూ ఎంతో న‌మ్మ‌క‌స్తుడిగా ప‌నిచేస్తున్నారు. షాద్ నగర్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబుకు అత‌యంత ద‌గ్గ‌ర‌యి చాలా వ‌ర‌కు నామినేటెడ్ పోస్టుల్లో ప‌నిచేశారు. బీసీల్లో మంచి ప‌ట్టున్న నేత కావ‌డంతో ఆయ‌న్నే చంద్ర‌బాబు అధ్య‌క్షుడిని చేస్తారంటూ ప్ర‌చారం ఊపందుకుంది.