ఈటల పాదయాత్ర ప్రారంభం నేటి నుండే..

టీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ కేసీఆర్ పై ఎన్నో విమర్శలు చేశారు. ఆత్మగౌరవంతో బయటకు వచ్చానని చెప్పుకున్న ఈటల, బీజేపీలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నిక ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుండే వ్యాహాలు అమలుచేయడానికి సిద్ధం అవుతున్నారు. హుజురాబాద్ లో పాదయాత్ర చేస్తానని చెప్పిన ఈట. ఈరోజే దానికి శ్రీకారం చుట్టనున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని బత్తినివాని పల్లె నుండి ఉదయం 9:30గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది.

శనిగరం, మాదన్నపేట, గునిపర్తి, శ్రీరాముల పేట, అంబాల మొదలుకుని మొత్తం 23రోజుల పాటు 127గ్రామాల్లో 270కిలోమీటర్లు పాదయాత్ర జరగనుంది. మరి ఈ పాదయాత్ర కలిసి వచ్చి హుజురాబాద్ నియోజకవర్గ ఉపఎన్నికల్లో ప్రభావం పడుతుందా లేదా అనేది చూడాలి. ఇదిలా ఉంటే ఇటు కాంగ్రెస్ కూడా హుజురాబాద్ ఎన్నికపై ఫోకస్ బాగానే పెట్టింది.