సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మేమంతా సిద్ధం బస్ యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ యాత్రతో ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఏపీలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తేలిపోయింది. వందకుపైగా పైగా సీట్లతో మళ్ళీ జగనే సీఎం కాబోతున్నారని తెలుస్తోంది. అటు సర్వే సంస్థలు కూడా ఇదే విషయాన్ని తేల్చిచెప్తున్నాయి.ఈసారి ఎలాగైనా గెలవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు…సీఎం జగన్‌కి వస్తున్న జనాదరణ పట్ల రగిలిపోతున్నారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్‌పై జరిగిన రాళ్ళదాడి చంద్రబాబు పనేనని టీడీపీ శ్రేణులు ఆగ్రహం చెందుతున్నాయి.
జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మేమంతా సిద్ధం అనే యాత్రతో రాష్ట్రం అంతా వైసీపీ గాలి వీస్తోంది.దీనిని జీర్ణించుకోలేక ఎలాగైనా దీనిని డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఉద్దేశ్యపూర్వకంగా జగన్ మీద దాడి చేయించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.దాడి జరిగిన వెంటనే రాజకీయాలు పక్కనపెట్టి మానవతా కోణంలో దాడిని ఖండించాలి.. కానీ.. టీడీపీ నాయకులు ఇది కావాలనే వైసీపీ కార్యకర్తలు చేశారంటూ దారుణంగా టీడీపీ సొంత ఛానళ్ళలో ,న్యూస్ పేపర్లలో కథనాలు ప్రసారం చేయించారు.దీనిని వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. తన గెలుపు కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారనేందుకు ఇదొక ఉదాహరణ అని వైసీపీ నాయకులు తిట్టిపోస్తున్నారు. సీకం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్న చంద్రబాబు….దాడులు కూడా చేయించడం హేయమైన చర్య అని విమర్శిస్తున్నారు.
సీఎం జగన్‌పై జరిగిన దాడి పట్ల దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు.ఈ గాయం నుంచి జగన్ త్వరగా కోలుకోవాలని ఆయన ట్వీట్ చేశారు.మోదీ కూడా స్పందించడంతో ఇది ఏదో తేడా వచ్చేలా ఉంది అని వెంటనే చంద్రబాబు కూడా తన స్పందన తెలియజేశారు.దాడిని ఖండిస్తున్నానని ట్వీట్ చేయడమేకాదు ఆ నెపాన్ని అధికారులపై నెట్టేశాడు. యంత్రాంగం సరిగా లేనందువలనే దాడి జరిగిందని పేర్కొన్నారు.ఇక్కడే చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యాడు. సహచర నేతకు అండగా నిలవాల్సింది పోయి ఇలా వ్యవహరించడం ఏంటని అటు ప్రజలు కూడా ఖండిస్తున్నారు.జగన్ మీద దాడి చేయించిన చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని అంటున్నారు.తెలుగుదేశం పార్టీ ఈసారి అధికారంలోకి రావడం జరగబోదని తేల్చి చెప్తున్నారు.
I strongly condemn the attack on @ysjagan. I request the @ECISVEEP to initiate an impartial and unbiased inquiry into the incident and punish the responsible officials.
— N Chandrababu Naidu (@ncbn) April 13, 2024
నటనకు నవత తరగని యువత
నీ రస హృదయం రాయని కవిత
అభినయ సిరి గా అభినవ గిరి గా
వచ్చాడు రస రాజు
నిన్ను చూసి మెచ్చాడు నట రాజు#KodiKathiDrama2 #AndhraPradesh pic.twitter.com/CFx1mteuEO— Telugu Desam Party (@JaiTDP) April 14, 2024
పెద్దిరెడ్డి కరెక్ట్ గా చెప్పారు..#KodiKathiDrama2 #AndhraPradesh pic.twitter.com/dXJ1jhBuHb
— Telugu Desam Party (@JaiTDP) April 14, 2024
జఫ్ఫాస్ బిఫోర్ పేమెంట్, ఆఫ్టర్ పేమెంట్…#KodiKathiDrama2 #AndhraPradesh pic.twitter.com/BwDCFLkvvr
— Telugu Desam Party (@JaiTDP) April 14, 2024