తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నా సరే ఆయనతో కొన్ని వర్గాలు కలిసి రావడం లేదు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు వామపక్షాల విషయంలో ముందు నుంచి అనుకూలంగానే ఉన్నారు. అయితే 2019 ఎన్నికల తర్వాత వామపక్షాలను చంద్రబాబు నాయుడు కాస్త దగ్గర చేసుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నారు. అమరావతి ఉద్యమంలో వామపక్షాలతో కలిసి చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ రాజకీయం తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు మేలు చేకూరుస్తుంది ఏంటి అనేది స్పష్టత లేదు. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు చూస్తే తిరుపతి ఉప ఎన్నికల్లో వామపక్షాల మద్దతు కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వామపక్షాలకు సంబంధించి కొంత మంది కీలక నేతలు చంద్రబాబు నాయుడితో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది.
వామపక్షాలతో చంద్రబాబు నాయుడు భేటీ అయితే వైసీపీకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చనే అభిప్రాయం ఉంది. క్షేత్రస్థాయిలో కొన్ని ప్రాంతాల్లో బలం ఎక్కువగానే ఉంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలంగా కనబడుతుంది. ఆ పార్టీతో కలిసి వెళితే కొన్ని కొన్ని ఉద్యమాల విషయంలో సహకారం కూడా ఉంటుంది. అందుకే తిరుపతి ఉప ఎన్నికలు అయిన తర్వాత కూడా వాళ్లతో కలిసి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.