కేసీఆర్ జాతీయ పార్టీ.. చంద్రబాబు రియాక్షన్ ఏంటంటే..?

-

ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి ఆమోదం తెలుపుతూ టీఆర్ఎస్ సభ్యులు తీర్మానంపై సంతకం చేశారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు.

మరోవైపు.. కేసీఆర్ జాతీయ పార్టీకి పలు ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి కూడా ఈ పార్టీలు హాజరయ్యాయి. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ఇతర జేడీఎస్ నేతలతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతీయ పార్టీ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అయితే కేసీఆర్ జాతీయ పార్టీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని సతీసమేతంగా ఆయన దర్శించుకున్నారు. చంద్రబాబు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం చంద్రబాబును మీడియా ప్రతినిధులు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీపై ప్రకటనపై స్పందన కోరగా.. ఓ నవ్వు నవ్వి అక్కడ నుంచి ఆయన వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news