ఆ తమ్ముళ్లపై బాబు వేటు..లిస్ట్ రెడీ?

-

చంద్రబాబులో కూడా బాగా మార్పు వచ్చింది…నాయకులు సరిగ్గా పనిచేయకపోతే ఉదాసీనతతో ఉంటూ…మళ్ళీ మళ్ళీ వారికి అవకాశాలు ఇవ్వడానికి రెడీగా లేరు. ఈ సారి గెలుపు అనేది చాలా ముఖ్యమనే సంగతి తెలిసిందే. మళ్ళీ గెలవకపోతే ఏం జరుగుతుందో బాబుకు బాగా తెలుసు…అందుకే ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే దిశగా బాబు పనిచేస్తున్నారు. తనతో పాటు తమ నేతలని దూకుడుగా పనిచేయించేలా చేసుకుంటున్నారు.

కానీ ఇప్పటికీ కొందరు నేతలు సరిగ్గా పనిచేయడం లేదు..పార్టీ ఏదైనా పోరాట కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సరే..పూర్తి స్థాయిలో విజయవంతం చేయడం లేదు..కొందరు నేతలైతే బయటకు రావడం లేదు. ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది…అయినా సరే నేతల్లో కదలిక లేదు. అలాంటి నేతలకు ఇటీవలే చంద్రబాబు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇకనైనా సరిగ్గా పనిచేయాలని లేదంటే వారిని తప్పించి కొత్త ఇంచార్జ్‌లని పెడతానని చెప్పారు. అలాగే వరుసపెట్టి నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్‌లతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

అయితే వీరిలో కొందరికి బాబు డైరక్ట్ గానే వార్నింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఏ మాత్రం బయటకొచ్చి పనిచేయని నేతలని తీసి పక్కన పెట్టేయాలని భావిస్తున్నారట. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు చెందిన ఇంచార్జ్‌లు దూకుడుగా రాజకీయం చేయడంలో విఫలమవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో నేతలు యాక్టివ్‌గా కూడా పనిచేయడం లేదట.

ఇటు తాజాగా కృష్ణా జిల్లా నేతలకు బాబు ఇటీవల వార్నింగ్ ఇచ్చారు..నేతలు సరిగ్గా కార్యక్రమాలు చేయడం లేదని, చెన్నుపాటి గాంధీపై దాడి జరిగినా…ఆ అంశంపై సరిగ్గా పోరాటం చేయలేదని క్లాస్ తీసుకున్నారు. ఇలా ఎక్కడకక్కడ నేతలకు వార్నింగ్ ఇస్తున్న బాబు…కొందరు నేతలని ఇంచార్జ్ పదవుల నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే పలువురుపై వేటు వేసి కొత్త ఇంచార్జ్‌లని పెట్టారు…త్వరలో మరికొందరిపై వేటు వేయడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news