ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కఠిన నిర్ణయాలు తీసుకునే విషయంలో చంద్రబాబు నాయుడు కొన్ని విషయాల్లో భయపడుతున్నారనే భావన చాలా వరకు వ్యక్తమవుతుంది. రాజకీయ పరిస్థితులను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చుకోవాల్సిన తరుణంలో వివాదాస్పదంగా వ్యవహరించడం సమస్యలకు దారితీస్తుంది.
ఇక తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది కీలక నేతలు బయటకు వెళ్లి పోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే ఇప్పుడు పార్టీలో అగ్రనేతలను పదవుల నుంచి పక్కన పెట్టడానికి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు అని కొంతమంది అంటున్నారు. అయితే కొంతమంది చంద్రబాబు నాయుడు మాట వినడం లేదని దీని కారణంగా పార్టీ సంస్థాగతంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పార్టీలో కీలక మార్పులు చేయాల్సిన తరుణంలో చంద్రబాబు నాయుడు కొంతమందిని నెత్తిన పెట్టుకుని ముందుకు వెళ్ళడంతో ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు వద్ద కొంత మంది ఎమ్మెల్యేలు మాట్లడకపోవడానికి ప్రధాన కారణం సీనియర్ నేతలే అనే అభిప్రాయం ఉంది. అందుకే గొట్టిపాటి రవికుమార్ లాంటి ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వద్దకు రావడం లేదని సమాచారం. కొంత మంది అగ్ర నేతలు పార్టీలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్లడం లేదని అంటున్నారు.