ఢిల్లీలో తేలిపోయిన “బాబు బిజెపి” టీం…!

-

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులను అడ్డుకోవాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చుక్కలు చూస్తున్నారు. రాజకీయంగా బలం లేకపోవడంతో శాసనసభలో బిల్లు ఆపలేకపోయిన ఆయన తనకు ఉన్న మార్గాల ద్వారా మండలిలో బిల్లుని సెలెక్ట్ కమిటికి పంపించారు. అంత వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు జగన్ దూకుడు ముందు తేలిపోతున్నారు.

వాస్తవానికి రాజధాని విషయంలో జగన్ ఒక స్పష్టతతో ఉన్నారు అనేది వాస్తవం. తాను విశాఖ వెళ్లి కూర్చుంటే అన్ని శాఖల అధికారులు అక్కడికే వస్తారని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మేరకు జగన్ కసరత్తులు కూడా పూర్తి చేస్తున్నారు. అయితే కేంద్రం నుంచి జగన్ ని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు అనేది వాస్తవం. ఈ నేపధ్యంలోనే కేంద్రంలో ఉండే తన టీం ని అలెర్ట్ చేసారు.

కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో ఉండే ఒక కేంద్ర మంత్రి, ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఒక కీలక నేత, అలాగే తన పార్టీ నుంచి వెళ్ళిన రాజ్యసభ సభ్యుడు సుజనా ఇలా ఒక్కొక్కరిని ఆయన అలెర్ట్ చేసారు. అంత వరకు బాగానే ఉంది గాని… ఇప్పుడు వాళ్ళు తేలిపోతున్నారు. రాజధాని వద్దని కేంద్రంతో చెప్పించాలని చూసారు. కాని కేంద్ర౦ మాత్రం రాష్ట్ర వ్యవహారాలతో మాకు సంబంధం లేదు మేము తలదూర్చేది లేదని చెప్పింది.

ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పెట్టుకునే అవకాశం ఉందో మాకు తెలియదు అని కూడా చెప్పేసింది. దీనితో ఇప్పుడు చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. తన టీం కూడా అక్కడ ఏమీ చేయలేకపోవడంతో చంద్రబాబు ఇప్పుడు దాదాపుగా ఈ విషయంలో చేతులు ఎత్తేసారు. ఇక మండలి రద్దు బిల్లు కూడా రాష్ట్రంలో ఆమోదం పొందింది కాబట్టి అడ్డుకునే అవకాశం కూడా కేంద్రం వద్ద లేదు. దానికి తోడు ఐటి దాడులు… ఇలా ఒక్కొక్కటి చంద్రబాబుకి చుక్కలు చూపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news