ప‌స‌లేని ఆరోప‌ణ‌లు చేస్తున్న చంద్ర‌బాబు.. ఇప్పుడు ఆ అంశంపై..

ప్ర‌తి ప‌క్షంలో ఉన్న చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తామే అధికారంలోకి వ‌స్తామంటూ చెబుతున్నారు గానీ అస‌లు అందుకు త‌గ్గ‌ట్టు పోరాటాలు మాత్రం చేయ‌ట్లేదు. తామే అధికారంలోకి వ‌చ్చేందుకు త‌మ పార్టీకి నూరుశాతం అవకాశాలు ఉన్నాయ‌ని చెప్తున్న చంద్ర‌బాబు నాయుడు అవేంటో మాత్రం బ‌య‌ట పెట్ట‌డం లేదు. ఇక రీసెంట్ గా తెలుగు రైతుసంఘాల నేతలతో ఆయ‌న స‌మావేశః నిర్వ‌హించి జగన్ పాలనలో ప్రజలంతా తీవ్ర‌మైన స‌మ‌స్య‌లు ప‌డుతున్న‌ట్టు తెలిపారు. కానీ ఎక్క‌డ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చెప్ప‌లేదు.

chandrababu naidu

ఆయ‌న మొద‌టి నుంచి ఇలాంటి తేలిక‌పాటి విమ‌ర్శ‌లు చేస్తున్నారే త‌ప్ప ప‌లానా చోట ప‌లానా విధంగా ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, ఇందుకు జ‌గ‌నే కార‌ణ‌మ‌ని క్లియ‌ర్ గా చెప్పి ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌లేక‌పోతున్నారు. స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోతే ఏ నాయుకుడిని ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌నేది అంద‌రికీ తెలిసిందే. ప‌స లేని ఆరోప‌ణ‌లు చేస్తే అవి పెద్ద‌గా స‌క్సెస్ కాక‌పోవ‌చ్చు. ఇక తాజాగా కూడా ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు చంద్ర‌బాబు నాయుడు.

రీసెంట్‌గా గుజరాత్ లో దొరికిన రూ.21 వేల కోట్ల హెరాయిన్ కు ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ముడిపెట్టారు చంద్ర‌బాబు. వారు ఏపిలో బిజినెస్ చేయటానికే వ‌చ్చార‌ని ఆరోపించారు. కానీ గుజరాత్ రాష్ట్రానికి ప్రధాని మోడీని మాత్రం విమ‌ర్శించ‌లేక‌పోయారు. ఏపీలో డ్రగ్స్ వ్యాపారాన్ని జ‌గ‌న్ ప్రోత్స‌హిస్తున్న‌ట్టు చెప్పిన చంద్ర‌బాబు అందుకు త‌గ్గ ఆధారాలు మాత్రం వెల‌ల్డించ‌లేక‌పోయారు. ఒక సాధార‌ణ ఎమ్మెల్యే మాట్లాడిన‌ట్టు ఆయ‌న ఆరోప‌న‌లు ఉంటున్నాయ‌ని నిపుణులు వెల్ల‌డిస్తున్నారు. ఆయ‌న శిష్యుడిగా ఉన్న రేవంత్ ఎలా ఆధారాలు సేక‌రించి మాట్లాడుతున్నారో అలా అయినా ఆరోప‌ణ‌లు చేయాల‌ని సూచిస్తున్నారు.