ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. అమరావతి పరిరక్షణ సమితికి మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుంది. అమరావతి పరిరక్షణ పేరుతో నూతన కార్యాలయాన్ని చంద్రబాబు, అఖిలపక్ష ప్రారంభించారు. అక్కడి నుంచి పోలీసులు అడుగునా అడుగునా అడ్డు తగిలారు.
ఇక ఇదిలా ఉంటే అమరావతి పరిరక్షణ పేరుతో బస్ యాత్రకు నేతలు నిర్ణయించారు. ఈ నేపధ్యంలో ఆ యాత్రకు పోలీసులు బ్రేక్ వేసారు. యాత్రకు వెళ్ళాలి అనుకున్న బస్సులను సీజ్ చేసారు పోలీసులు. దీనితో సీజ్ చేసిన బస్సులు అప్పగించాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. బస్సులని ఆపిన చోట నుంచి పాదయాత్రకు వెళుతున్న చంద్రబాబు, జేఏసీ నేతలు అడ్డుకున్నారు పోలీసులు.
బస్సులను కావాలని అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ నేపధ్యంలో చంద్రబాబుకి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు’ జేఏసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాదయాత్రను విరమించుకోవాలని చంద్రబాబుకి పోలీసులు సూచించినా ఆయన వెనక్కు తగ్గలేదు. ఉద్యమాన్ని ఆపలేరు ఎంత మందినైనా అరెస్టు చేసుకోండని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు.