తొలిసారి రియాక్ట్ అయిన సీఎం… కాంగ్రెస్ ఎఫెక్టేనా

-

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారి ఓ పార్టీకి రియాక్ట్ అయినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం చాలా రోజుల సస్పన్స్ తర్వాత ఇటీవలే మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని పట్టించుకోని.. సీఎం కేసీఆర్ తొలిసారిగా కాంగ్రెస్ పార్టీకి ఎంపీ రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించగానే… దళితులకు వరాల జల్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు తెలంగాణ రాక ముందు రాష్ర్టానికి దళితుడినే తొలి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ హామీ మరిచి…. రెండు పర్యాయాలుగా తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. దీనిపై విపక్షాలు ఎంతలా రాద్దాంతం చేసినా… కూడా కేసీఆర్ లైట్ తీసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డిని పీసీసీ ఛీఫ్ గా ప్రకటించగానే దళిత నేతలతో సమావేశమవడం రాజకీయ వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పుకోవాలి.

కాంగ్రెస్/ cmkcr

రాష్ర్టంలో ఉన్న దళితులు, దళిత నేతలు టీఆర్ఎస్ పై తాను అధికారంలోకి రాక ముందు దళితులకు చేస్తానన్న హామీలపై ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం టీపీసీసీకి కొత్త బాస్ కూడా ఎంపిక కావడంతో ఈ సమయంలో దళితులను మచ్చిక చేసుకునేందుకే వారికి అడగకుండానే వరాలు కురిపించాడని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ ఆరేళ్లలో గుర్తుకు రాని దళితులు, దళితులకిచ్చిన హామీలు సడెన్ గా గుర్తుకు రావడానికి కొత్త పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ఎఫెక్టేనని అంటున్నారు.

ఏదేమైనా దళితులకు ముఖ్యమంత్రి ప్రకటించిన వరాలతో వాళ్లు మస్తు జోష్ లో ఉన్నారు. గ్రామాలు, మండలాల్లో కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాము ఎల్లప్పటికీ కేసీఆర్ వెంటే నడుస్తామని పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news