తమిళనాడులో అన్నా డీఎంకే భారతీయ జనతా పార్టీ కూటమి విజయం సాధిస్తుందా లేదా అనేది చెప్పడం కాస్త కష్టంగానే ఉంది. అక్కడ ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ బలంగా కనబడుతుంది. అన్నాడీఎంకే బలంగా ఉన్నా సరే నాయకత్వ సమస్య ఆ పార్టీని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. బిజెపి ప్రతి విషయంలో కూడా జోక్యం చేసుకోవడంతో అన్నాడీఎంకే అసంతృప్త నేతలు ఎక్కువగా బయటకు పోతున్నారు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నాడీఎంకే నిలబడటం కూడా కష్టం గానే ఉండవచ్చుననే అభిప్రాయం ఉంది. ప్రధానంగా అన్నాడీఎంకే కీలక నేతగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సిఎం పై ఆగ్రహంగా ఉన్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియదు. అయితే తమిళనాడులో మాత్రం ప్రచారం చేయడానికి తెలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది వెళ్లే అవకాశం ఉందని టాక్.
అక్కడ తెలుగువారు ఎక్కువగా ఉండటం అలాగే కాపు సామాజిక వర్గానికి చెందిన వారు తమిళనాడులో కొన్ని వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కువగా స్థిరపడ్డారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి ద్వారా ప్రచారం చేయించే ఆలోచనలో బిజెపి నేతలు ఉన్నారని తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అవసరమైన దానికి అనవసరమైన దానికి కూడా పోగొడుతున్న చిరంజీవిని ఇప్పుడు తమిళనాడు ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.