ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి రాసిన లేఖకు సంబంధించిన సిఐడి విచారణలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి దాదాపుగా షాక్ తగిలే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ లేఖను ఎవరు రాసారు అనేది తేల్చాలని ఆయన సిఐడి కి ఫిర్యాదు చేయగా దీనిపై అధికారులు విచారణ మొదలుపెట్టారు. ఈ విచారణలో వాళ్ళు కీలక విషయాలను ఆరా తీసారు.
రమేష్ కుమార్ పీఎస్ సాంబమూర్తిని సిఐడి విచారించింది. ఈ విచారణలో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. సార్ నాకు పెన్‌డ్రైవ్‌లో లేఖ ఇచ్చారని… నా డెస్క్‌టాప్‌పై కరెక్షన్స్ చేశానని సాంబ మూర్తి వివరించారు. ఆ తర్వాత తిరిగి ఆయనకు లేఖ ఇచ్చానని అన్నారు. రమేష్ కుమార్ తన మొబైల్ ద్వారా లేఖను కేంద్రానికి పంపారని విచారణలో సాంబమూర్తి పేర్కొన్నారు.
దీనితో దాదాపుగా విచారణ ముగిసినట్టే అనేది అర్ధమవుతుంది. దీనిలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తే మాత్రం విజయసాయి కి షాక్ తగిలినట్లే అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. కాగా రమేష్ కుమార్ కేంద్రానికి రాసిన లేఖలో… తనకు ప్రాణ హాని ఉంది కాబట్టి కేంద్ర బలగాల నుంచి రక్షణ కల్పించాలని ఆయన ప్రస్తావించారు. ఇక తనను హైదరాబాద్ లో ఉండే విధంగా అనుమతించాలని కూడా ఆయన ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.