ధూళిపాళ్ళ ఆరోగ్యంపై అధికారుల క్లారిటీ…?

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర ఆరోగ్యం విషయంలో ఇప్పుడు ఆందోళన మొదలయింది. ఆయన ఆరోగ్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై కూడా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయనకు జ్వరం దగ్గు రావడంతో ఏం జరుగుతుందో అనే ఆందోళనలో కుటుంబం ఉంది. ఈ నేపధ్యంలో రాజమంఢ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావు మీడియాతో మాట్లాడారు.

రాజమంఢ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కు కరోనా పరీక్షలు నిర్వహించి కాకినాడ ల్యాబరేటరీకు పంపాం అని అన్నారు. ధూళిపాళ్ళకు కరోనా లక్షణాలు లేవు అని స్పష్టం చేసారు. ముందస్తు జాగ్రత్తగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం అని అన్నారు. కాకినాడ ల్యాబ్ నుంచి ఫలితాలు వచ్చిన తర్వాత చికిత్స పై తదుపరి చర్యలు తీసుకుంటాం అని అన్నారు.