అమరావతి రాజధాని విధ్వంసం ఒక కేసు స్టడీ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఒక రాజధానిని నిర్ణయించుకుని నిర్మాణం పనులు ప్రారంభించాక దానికి మళ్ళీ మార్చడం అన్నది ఇంతవరకూ ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదని చంద్రబాబు చెప్పారు. అమరావతి లాంటి రాజధానిని కదపడం అన్నది తొలిసారిగా జరిగిందని అన్నారు. భవిష్యత్తులో తిక్క గాళ్ళు ఎవరైనా రాజధానిని కదపడానికి చూస్తారని అందువల్ల ఎవరూ అలాంటి పని చేయకుండా దేశంలోనే రాజధానుల కోసం ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
కేవలం ఏపీకి మాత్రమే కాదు దేశంలోనే అమరావతి రాజధానిని చూసి న్యాయపరంగా ఏమి చేయాలన్నది ఆలోచించాల్సి ఉందని ఆయన అన్నారు. అమరావతి రాజధాని విషయం అందరికీ ఒక గుణపాఠం గా మారిందని అన్నారు. అమరావతి రాజధాని శాశ్వతంగా అక్కడే ఉండేలా ప్రత్యేక చట్టాన్ని రూపొందిచనున్నారు.
అమరావతిని ఎన్ని తరాలు గడచినా ఎక్కడికీ తరలించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అవన్నీ తాము చేస్తామని అన్నారు. మొత్తం మీద చంద్రబాబు మాటలు చూస్తూంటే ఫ్యూచర్ లో ఎంతటి వారు అధికారంలోకి వచ్చినా అమరావతి రాజధాని అడుగు కూడా కదల్చలేకుండా న్యాయపరమైన కట్టుదిట్టాలు చేసేలా ఉందని అంటున్నారు.అవసరం అయితే ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకుని వస్తారని అంటున్నారు.